వీధిలో ఒంటరిగా ఆడుకుంటూ 4 ఏళ్ల బాలుడిని ఓ ఎద్దు దాడి చేసింది. అంతేకాకుండా కిందపడిపోయిన బాలుడిపై ఎద్దు కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వీధిలో రోడ్డుపై ఉన్న ఓ 4 ఏళ్ల బాలుడిపై ఎద్దు వేగంగా దూసుకొచ్చి దాడి చేసింది. ఈ ఎద్దు దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు కిందపడి ఉన్న ఆ బాలుడిని రక్షించి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బుడ్డోడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అది ఉత్తర్ ప్రదేశ్ లోని అలీఘర్ ప్రాంతం. ఇక్కడే ఓ 4 ఏళ్ల బాలుడు వీధిలో ఒంటరిగా ఆడుకుంటూ ఉన్నాడు.
ఈ క్రమంలోనే రోడ్డుపై బాలుడికి ఎదురుగా నడుచుకుంటూ వచ్చిన ఓ ఎద్దు.. ఆ చిన్నారిని గమనించింది. ఇక ఆ ఎద్దు క్షణాల్లో బాలుడిని వేగంగా దూసుకొచ్చి కొమ్ములతో పొడిచింది. అంతేకాకుండా కిందపడిపోయిన ఆ బాలుడిపై కూర్చుంది. దీనిని గమనించిన ఓ వ్యక్తి క్షణాల్లో వచ్చి ఎద్దు ముందు ఉన్న ఆ బాలుడిని రక్షించారు. అనంతరం ఆ ఎద్దును అక్కడి నుంచి తరిమికొట్టారు. ఇక వెంటనే స్పందించిన ఆ బాలుడి తల్లిదండ్రులు హుటాహుటన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
UP : अलीगढ़ में सांड ने मासूम बच्ची को रौंद डाला। बच्ची घायल है, अस्पताल में भर्ती है। pic.twitter.com/BPvzluQh0I
— Sachin Gupta (@sachingupta787) March 9, 2023