ప్రేమ.. వయసుతో పని లేదు, కులంతో అసలే పని లేదు. పైన తెలిపినట్లుగానే ప్రేమకు వయసుతో పనిలేదని నిజం చేసి చూపించింది ఈ ప్రేమ జంట. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో కైలారస్ లొకాలిటీకి చెందిన భోలూ అనే 28ఏళ్ల యువకుడు రాంకలీ అనే 67ఏళ్ల మహిళతో ప్రేమలో పడ్డాడు.
ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ వీరి ప్రేమను నిలబెట్టుకునేందుకు మాత్రం ఎన్నో తంటాలు పడాల్సి వచ్చింది. ప్రేమించుకున్నాం కానీ పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని ఈ విషయంలో తమకు ఎలాగైన న్యాయం చేయాలని గ్వాలియర్ జిల్లా కోర్టును ఆశ్రయించింది ఈ ప్రేమ జంట. తమ రిలేషన్‌షిప్ గురించి భవిష్యత్ లో ఎలాంటి గొడవలు రాకుండా లివ్- ఇన్ రిలేషన్‌షిప్ డాక్యుమెంట్ ను నోటరీ చేయాలని కోరారు. ఈ అసాధారణమైన ప్రేమకథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.