బెంగళూరులోని ఫోర్టిస్ హాస్పటల్‌లోని డాక్టర్లు 13 మంథ్స్ చిన్నారి రెండు కిడ్నీలును 30 సంవత్సరాల వ్యక్తికి అమర్చారు. రోబోటిక్ ఎన్-బ్లాక్ అనే విధానంలో ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేశారు.
ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మనం తినే ఆహారం వల్ల కావచ్చు. తినే అలవాట్ల వల్ల కావచ్చు. ఏదైనా కానీ ఈ రోజుల్లో రోగం లేని వ్యక్తులు అంటూ ఎవరూ లేరు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంది. వాటిని అధిగమించే ప్రయత్నంలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే లక్షల కొద్ది బిల్లులు.. సర్కార్ దవాఖానకు వెళ్దామంటే అక్కడ నాణ్యత లేని ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎంత చిన్న జబ్బు వచ్చినా కూడా ఇల్లు, ఒళ్లు గుల్ల కావలసిందే. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామందికి మూత్రపిండాలు ఫెయిల్ అవుతున్నాయి. రెండు కిడ్నీలు పాడవటం వల్లఅయితే అవయవదానం వల్ల కొంత మందినైనా కాపాడుకునే అవకాశం ఉంటుంది. దానాలన్నింటిలో అవయవ దానం చాలా గొప్పది. అవయవ దానంతో మనం చనిపోయిన తర్వాత కూడా చనిపోయే వ్యక్తిని బతికించవచ్చు. అలాంటిదే బెంగుళూరులోని డాక్టర్లు నిరూపించారు. 13 నెలల పాప మూత్రపిండాల్ని 30 ఏళ్ల యువకునికి అమర్చి అద్భుతం సృష్టించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… బెంగళూరులోని ఫోర్టిస్ హాస్పటల్‌లోని డాక్టర్లు 13 మంథ్స్ చిన్నారి రెండు కిడ్నీలును 30 సంవత్సరాల వ్యక్తికి అమర్చారు. రోబోటిక్ ఎన్-బ్లాక్ అనే విధానంలో ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేశారు. అయితే ఈ ఆపరేషన్‌లో యూరో ఆంకాలజీ, రోబోటిక్ సర్జరీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహర్ష హరినాథ్ వైద్య బృందం పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో డాక్టర్లు, పేషెంట్ కుటుంబసభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవమూర్తి మాట్లాడుతూ..
కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఓ 30 ఏళ్ల వ్యక్తి, హీమో డయాలసిస్ చేయించుకుంటున్నాడని.. అతడికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చిందని.. ఓ 13 నెలల చిన్నారి ఊపిరాడక మృతి చెందిందని.. ఆ చిన్నారి తల్లిదండ్రుల అంగీకారంతో కిడ్నీలను దానంగా పొందాడని.. అయితే ఆ చిన్నారి బరువు 7.3 కిలోలు మాత్రమేనని.. 30 ఏళ్ల వ్యక్తి 50 కిలోల బరువున్నాడు కాబట్టి అతడికి ఆ చిన్నారి కిడ్నీలు ట్రాన్స్‌ప్లాంట్ చేయడం పెద్ద సవాలని.. ఈ ఆపరేషన్‌ను ఛాలెంజ్‌గా తెలుసుకుని.. రోబోటిక్ ఎన్-బ్లాక్ విధానం ద్వారా కిడ్నీలు మార్పిడి చేశామని.. ఈ వినూత్న విధానం ద్వారా మార్పిడి చేసిన కిడ్నీలు.. గ్రహీత శరీర బరువుకు తగిన పరిమాణంలో పెరుగుతాయని.. దాదాపు నాలుగు గంటల పాటు ఈ శస్త్రచికిత్స జరిగిందని.. ఈ సంక్లిష్ట సర్జరీ తర్వాత, రోగిని ఐసీయూలో ఉంచామని.. 12 రోజుల తర్వాత అతను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని.. వెల్లడించారు.
ఈ సందర్భంగా.. కిడ్నీ మార్పిడిలో ఎలాంటి కష్టమైన శస్త్రచికిత్స అయినా రోబోటిక్స్‌తో సులభంగా నిర్వహించవచ్చునని.. ముఖ్యంగా చిన్న పిల్లల కిడ్నీని పెద్దవారికి అమర్చడం సవాలేనని.. మా వైద్యుల బృందం సరికొత్త సాంకేతికతను ఉపయోగించి ఈ వినూత్న ప్రయత్నాన్ని విజయవంతంగా నిర్వహించిందని.. ఇలాంటి సర్జరీ ప్రపంచంలోనే ఇదే మొదటిదని అక్షయ్ ఓలేటి, ఫోర్టిస్ ఆస్పత్రి బిజినెస్ హెడ్ తెలిపారు.