10 నెలల చిన్నారికి రైల్వేశాఖలో ఉద్యోగం.. పుట్టి ఏడాది కూడా కాలేదు, అప్పుడే 10 నెలల చిన్నారికి రైల్వేశాఖలో ఉద్యోగం ఏంటని తీవ్రంగా ఆలోచిస్తున్నారా? అవును.. ముమ్మాటికి ఇది నిజమే. ఉన్నత చదువులు చదివి కోచింగ్ తీసుకుని సంవత్సరాల తరబడి చదువుతున్న నిరుద్యోగులకే ఉద్యోగాలు లేకా ఏడుస్తుంటే.. తల్లి పాలకు ఏడ్చే ఈ చిన్నారికి రైల్వే శాఖ అధికారులు ఉద్యోగం కల్పించారు. ఇక ఇదే కాకుండా తాజాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తైనట్లు అధికారులు తెలిపారు. దీని వెనుక ఏదైన బలమైన కారణం ఉండొచ్చనే మీ అనుమానం కూడా నిజమే.
ఇక విషయం ఏంటంటే..? ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌లోని పీపీ యార్డ్‌లో రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే జూన్ 1న మందిర్ హసౌద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్ర కుమార్ తో పాటు ఆయన భార్య కూడా మరణించింది. రాజేంద్రకుమార్, ఆయన భార్య, కూతురు బైక్‌పై వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే రాజేంద్ర కుమార్ మరణంపై అతను పని చేసే రాయ్‌పూర్ రైల్వే డివిజన్ డిపార్ట్ మెంట్ అధికారులు బతికున్న పాపకు ఏదైన న్యాయం చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే రాజేంద్ర కుమార్ ఉద్యోగాన్ని ఆయన కూతురికి ఇవ్వాలని అధికారులంతా నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. మొసలిని పెళ్లాడిన మేయర్.. ఎందుకంటే?
కాకపోతే ఆ చిన్నారి 10 వయసే ఉండడంతో ఆలోచనలో పడ్డారు. ఏదైతేనేం రాయ్‌పూర్ రైల్వే డివిజన్ నిబంధనల ప్రకారం తండ్రి ఉద్యోగాన్ని ఆయన కూతురికి కల్పించారు. తాజాగా రైల్వేశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రిక్రియ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ అమ్మయి మెజారిటీ వయసు వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరుతుందని, అప్పుడు ఉద్యోగులకు లభించే అన్ని వసతులు ఆ పాపకు కూడా వర్తిస్తాయి అధికారులు తెలిపారు. ఇంత చిన్న వయసులో ఉన్నవారికి ఉద్యోగం కల్పించడం దేశంలో ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇదే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.