వైద్య చరిత్రలోనే తాజాగా ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆరు రోజుల వ్యవధిలో 5 సార్లు గుండెపోటు వచ్చినా ఓ వృద్ధురాలు తట్టుకుని నిలబడ్డారు. 81 ఏళ్ల వయసులో ఆమె మరణం అంచుల వరకూ వెళ్లివచ్చారు.
ఈ మధ్యకాలంలో గుండె పోటులతో సంబంధించిన మరణాల సంఖ్య బాగా పెరిగింది. ఎంతో ఆరోగ్యం కనిపించే వారు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే వయస్సుతో సంబంధం లేకుండా యువకులు సైతం గుండె పోటుకు గురవుతున్నారు. ఇలా గుండెపోటు మరణాలతో అందరు భయాంత్రులకు గురవుతున్న సమయంలో ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. 81 ఏళ్ల ఓ వృద్ధురాలికి ఆరు రోజుల వ్యవధిలో ఐదు సార్లు గుండె పోటు వచ్చింది. అయితే ఒకటి, రెండు సార్లు వరుసగా హార్ట్ స్ట్రోక్ వస్తేనే బతకడం కష్టంగా భావించే ఇలాంటి తరుణంలో ఆమె ఏకంగా ఐదు సార్లు గుండె పోటు గురైనా కూడా మృత్యుజయురాలిగా నిలిచింది. మరి.. ఈ మిరాకిల్ కి సంబందించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీకి చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు శ్వాసకోస సంబంధిత సమస్యలతో స్థానిక మ్యాక్స్ అనే ప్రవేటు ఆస్పుత్రిలో చేరింది. అప్పటికే ఆమె శ్వాస తీసుకునేందు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు.. గుండె సామర్థ్యం 25 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు. అలానే గుండె స్పందనలోనూ లోపం కనిపించింది. దీంతో ఆమెకు ఏంజియోగ్రఫీ చేసి తాత్కలికంగా పేస్ మేకర్ అమర్చారు. ఇలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో అకస్మాత్తుగా ఆమెకు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో వెంటనే వైద్యులు ఏఐసీడీ అనే పరికరం సాయంతో గుండెను తిరిగి కొట్టుకునేలా చేశారు.
దీంతో బాధితురాలి గుండె పనితీరు బాగానే ఉన్నట్లు.. అలానే ఆమె కూడా క్రమంగా కోలుకున్నట్లు వైద్యుడు సింగ్ వివరించారు. విషమ పరిస్థితిలో ఆస్పత్రికి చేరిన వృద్ధురాలికి వైద్యులు చేసిన కొన్ని చికిత్సలేవీ ఫలించకపోవడంతో తొలుత కుటుంబ సభ్యులు ఆమెపై ఆశలు వదులుకున్నారు. కానీ, ఆ సమయంలో వైద్యులు అనేక ప్రత్యామ్నాయాలను పరిశీలించి.. చివరకు ఏఐసీడీతో ఆమె ప్రాణాలను నిలిపారు. ఇక వైద్యులు అందించిన ఈ చికిత్సతో ఆ బామ్మ పూర్తిగా కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. అయితే బామ్మ కోలుకోవడంపై వైద్యులు స్పందించారు.
డాక్టర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..” ఇది నిజంగా ఓ అద్భుతం. వైద్య చరిత్రలో ఇలాంటి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆధునిక వైద్య పద్ధతులు, ఆమెలోని శక్తి సామర్థ్యాలే ఈ గండం నుంచి గట్టేక్కేలా చేశాయి. మెనోపాజ్ దశ తరువాత ఆమహిళ గుండె పోటు పడే అవకాశాలు ఉన్నాయి” అని వైద్యులు తెలిపారు. మరి.. ఈ వైద్యశాస్త్రంలో జరిగిన ఈ అద్భుతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.