ఇటీవల దేశంలో బోరుబావిలో పడి చిన్నారులు చనిపోయారు అన్న వార్తలు ఎన్నో వచ్చాయి.. అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. పనికి రాని బోరు బావులను పూర్తిగా కప్పిపెట్టాలని ప్రజలకు ఎన్ని అవగాహన సదస్సులు పెట్టి చెబుతున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికీ పలు చోట్లు బోరు బావుల్లో పడి పిల్లలు చనిపోతూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితం బేతుల్ జిల్లా మాండవి ఊరిలో బోరుబావిలో పడిపోయిన బాలుడి కథ విషాదాంతం అయ్యింది.
డిసెంబర్ 6న మంగళవారం సాయంత్రం ఎనిమిదేళ్ల బాలుడు తన్మయ్ దియావర్ అడుకుంటూ వెళ్లి 400 అడుగు లోతు ఉన్న బోరుబావిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు పోలీసులు. ముందుగా బాలుడికి ఊపిరి పీల్చుకునేందుకు ఆక్సీజన్ పైపులు లోపలికి పంపించారు. బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాలుడితో తండ్రి మాట్లాడే ఏర్పాటు చేశారు. ‘నాన్నా.. నాకు భయంగా ఉంది.. లోపల అంతా చీకటే.. త్వరగా బయటకు తీయండీ’ అని అంటున్నాడని తండ్రి బోరున విలపించాడు. బోరు బావి చుట్టూ త్రవ్వేందుకు ప్రొక్లెయినర్స్ ఏర్పాటు చేసి నాలుగు రోజుల పాటు శ్రమించి బావికి సమాంతంరంగా సొరంగం తవ్వారు.
బాలుడి కోసం బోరు బావిలో నిరంతరం ఆక్సీజన్ అందించిన నాలుగు రోజుల పాటు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శనివారం ఉదయం బాలుడిని బయటకు తీశారు రెస్క్యూటీమ్. వెంటనే ప్రత్యేక అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.. కానీ అప్పటికీ బాబు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బోరుబావిలో పడిన ఏనిమిదేళ్ల తన్మయ్ దియావర్ కథ విషాదాంతంగా ముగిసింది. బాలుడు చనిపోయిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు రోజులు పాటు తమ కొడుకు బతికి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూసిన తల్లిదండ్రులు విగజీవిగా ఉన్న చిన్నారిని చూసి బోరున విలపించారు. బాలుడి మరణంతో మాండవి గ్రామస్థులు శోక సంద్రంలో మునిగిపోయారు.
#WATCH | Madhya Pradesh | 8-year-old Tanmay Sahu who fell into a 55-ft deep borewell on December 6 in Mandavi village of Betul district, has been rescued. According to Betul district administration, the child has died pic.twitter.com/WtLnfq3apc
— ANI (@ANI) December 10, 2022