సాధారణంగా ఏదైనా ప్రమాదం జరగబోతుందని తెలిస్తే.. చాలా మంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తారు. అయితే తమ ప్రాణానికి హాని ఉందని తెలిస్తే.. ఇతరులను కాపాడే ప్రయత్నం ఎవరైనా చేస్తారా?. తమ ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి కూడా సాయం చేసేవారు కోటికి ఒక్కరు ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కర్ణాటకు చెందిన 70 ఏళ్ల బామ్మ.
సాధారణంగా ఏదైనా ప్రమాదం జరగబోతుందని తెలిస్తే.. చాలా మంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తారు. వారు స్పందించేక పోతే తమవంతుగా ప్రయత్నం చేస్తారు. ఇది తమ ఆరోగ్యం, ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉంటే చాలా మంది చేసే పని. అయితే గుండె ఆపరేషన్ చేయించుకుని, పరిగెత్తితే తమ ప్రాణానికి హాని ఉందని తెలిస్తే.. ఇతరులను కాపాడే ప్రయత్నం చేస్తారా?. దాదాపు ఎవరు చేయరు. తమ ప్రాణమే ముఖ్యంగా భావిస్తారు. తమ ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి కూడా సాయం చేసేవారు కోటికి ఒక్కరు ఉంటారు. అలాంటి వారిలో ఒకరు కర్ణాటకు చెందిన 70 ఏళ్ల బామ్మ. మరి.. ఆమె చేసిన ఆ సాహసం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటక రాష్ట్రంలోని పచ్చనాడి సమీపంలో మందార అనే ప్రాంతంలో చంద్రావతి అనే 70 ఏళ్ల బామ్మ కుటుంబంతో కలసి నివాసం ఉంటుంది. ఆమెకు ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కువ నడవద్దని, పరిగెడితే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు సూచించారు. దీంతో ఆమె కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈమెకు సంబంధించిన ఓ సాహస ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది ఏమిటంటే.. మార్చి 21 ఓ రైలును ఘోర ప్రమాదం నుంచి ఆ బామ్మ తప్పించింది. గత నెల 21 మధ్యాహ్నం 2.10 గంటలకు మంగలూరు-పఢీల్ జోకెట్ట మధ్యలో గల పచ్చనాడి సమీపంలోని మందార ప్రాంతంలో రైలు ట్రాక్ పై పెద్ద వృక్షం పడిపోయింది.
ఆ విషయాన్ని సమీపంలో ఉండే చంద్రవతి గమనించింది. అదే సమయంలో అటుగా ముంబై వెళ్లే మత్సగంధ రైలు వస్తుందనే విషయం ఆమెకు గుర్తుకు వచ్చింది. దీంతో ఎలాగైన రైలును ఆపాలని భావించింది. ఎవరికైన చెట్టు విరిగిన సమాచారాన్ని ఫోన్ చేసి చెబుదామని ఆమె ఇంట్లోకి వెళ్లింది. అయితే ఇంతలోనే రైలు హారన్ వినిపిస్తోంది. ఇక అంత సమయంలేక.. తన ఇంట్లోని ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని రైలు ఎదురుగా చాలా దూరం పరుగులు తీసింది. తన గుండెకు ఆపరేషన్ జరిగిన విషయాన్ని కూడా మరచి.. రైలులో ఉండే వారిని కాపాడాలని భావించింది.
పోతే తన ఒక్క ప్రాణమే కదా అని భావించి.. ఎరుపు వస్త్రంతో వేగంగా రైలు ఎదురుగా వెళ్లింది. దీంతో ఆ వృద్ధురాలిని గమనించిన లోకో ఫైలట్ రైలు వేగాన్ని తగ్గించి ఆపేశాడు. అనంతరం బామ్మ చెప్పిన మాటలు విని షాకయ్యాడు. ఆమె గానీ అడ్డురాకుంటే పెను ప్రమాదం సంభవించేదని వారు తెలిపారు. స్థానికులు, రైల్వే సిబ్బంది పట్టాలపై పడిన చెట్టును పక్కకు తొలగించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు అభినందించారు. అలానే చంద్రవతి సాహస కార్యానికి ప్రజలంతా ప్రశంస జల్లు కురిపించారు. మరి.. ఈ బామ్మ చేసిన సాహసం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.