దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన కాశీ విశ్వనాథుని అజ్ఞాత భక్తుడు ఒకరు, ఇటీవల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన తల్లి హీరాబెన్ బరువుతో సమానమైన 61 కేజీల బంగారాన్ని విరాళంగా అందించాడు. అతని పేరుని బయటికి చెప్పకుండా అజ్ఞాతంగా ఉండేందుకు ఇష్టపడుతున్నాడు.
ఈ సందర్భంగా వారణాసి డివిజనల్ కమిషనర్, దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఆలయానికి 61 కిలోల బంగారం వచ్చిందని, అందులో 37 కిలోల బంగారాన్ని లోపలి గోడకు బంగారు పూత కోసం ఉపయోగించామని చెప్పారు. మిగిలిన 23 కిలోలు ప్రధాన ఆలయ నిర్మాణం, బంగారు గోపురం దిగువ భాగాన్ని కవర్ చేయడానికి ఉపయోగిస్తామన్నారు. కాగా, 18వ శతాబ్దం తర్వాత ఆలయంలో ఇంత పెద్ద స్తాయిలో మరమ్మత్తులు చేయించడం..ఇది రెండోసారి.
మొదటిసారి మొఘలులచే దెబ్బతిన్న ఈ ఆలయాన్ని 1777లో ఇండోర్‌లోని హోల్కర్ రాణి మహారాణి అహల్యాబాయి పునర్నిర్మించారు, ఆ తర్వాత పంజాబ్‌కు చెందిన మహారాజా రంజిత్ సింగ్ ఒక టన్ను బంగారాన్ని విరాళంగా ఇచ్చారు, దీనిని ఆలయంలోని రెండు గోపురాలను కవర్ చేయడానికి ఉపయోగించారు. 18వ శతాబ్దం తర్వాత, 2017లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ పునరుద్ధరణ, విస్తరణ ఇటీవలే పూర్తయ్యాయి. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌గా పేరు పెట్టబడిన ఈ ప్రాజెక్ట్ రూ. 900 కోట్లతో పూర్తయింది. సమీపంలోని 300 భవనాలు కొనుగోలు చేశారు. ఆలయ విస్తీర్ణం 2700 చదరపు అడుగుల నుండి 5-లక్షల చదరపు అడుగులకు విస్తరించారు.
ఇక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన బంగారంతో కాశీ విశ్వనాథ దేవాలయం గోడలు, పైకప్పుపై ఇప్పటికే 37 కిలోల బరువున్న బంగారు పలకలను ఉంచారు. సుమారు ఒకటిన్నర నెలల క్రితం ఈ విరాళం ఇచ్చాడు. ఆదివారం నాటికి మొదటి దశ పని పూర్తయింది, ఈ విషయాన్ని ప్రధాని మోడీ సందర్శన తరువాత ఆయనకు తెలిపి.. అప్పటివరకు జరిగిన పనులు చూపించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. విశేషం ఏంటంటే.. 30 గంటల్లో పది మంది కార్మికులు ఈ పని పూర్తి చేశారు. అభిమానం అంటే ఇంత గొప్పగా ఉంటుందా.. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.