రోడ్డు ప్రమాదాలు అంటేనే చాలా ఘోరంగా ఉంటాయి. రోజులో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రమాదాలను చూస్తుంటాం. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. గాయాలతో బయటపడిన వాళ్లు బతికినంత కాలం ఆ గుర్తులతోనే జీవిస్తుంటారు. మంగళవారం ఉదయం ఓ ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై 6 వాహనాలు ఒక దానితో ఒకటి ఢీకొని మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి..
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి- చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కడలూరు జిల్లా వెప్పూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 6 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. కారులో ప్రయాణించే వ్యక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tamil Nadu | Five people were killed after 5 vehicles collided with each other near Veppur in Cuddalore district: Cuddalore Police pic.twitter.com/ww4xwOV9Uf
— ANI (@ANI) January 3, 2023
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెప్పూరు అగ్నిమాపక సిబ్బంది సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయింది. కారు ఆర్సీ ప్రకారం ప్రమాదానికి గురైన వాహనం చెన్నై సమీపంలోని నంగనల్లూరుకు చెందిందిగా గుర్తించారు. ప్రమాదానికి కారణాలు అతివేగమా? లేక మంచు కారణంగా జరిగిందా? అనే దానిపై పోలీసులకు క్లారిటీ లేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
#Chennai: In a tragic incident, five people were killed after five vehicles collided with each other near Veppur in Cuddalore district in #TamilNadu. pic.twitter.com/nMGtiN29CG
— Mirror Now (@MirrorNow) January 3, 2023