దేశంలో మాదక ద్రవ్యాల సరఫరా విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయిన అక్కడి సిబ్బంది కళ్లు గప్పి.. కొందరు అనేక విధాలుగా దేశంలోకి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. షూల్లో, శరీరంలో, హెయిర్ లో ఇలా అనేక విధాలుగా ఇతర దేశాల నుంచి డ్రగ్స్ ను మన దేశంలోకి సరఫరా చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ప్రయాణికురాలు.. కోట్ల విలువైన హెరాయిన్ ను సరాఫరా చేస్తూ కస్టమ్స్ అధికారులు చిక్కింది.
ఉగాండా నుంచి షార్జా మీదుగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఓ మహిళ ప్రయాణికురాలిపై ఎయిపోర్టు సిబ్బందికి అనుమానం కలిగింది. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని.. కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దీంతో ఆమెకు వైద్య పరీక్షలకు నిర్వహించగా శరీరంలోని పెద్దపేగు ఉండే ప్రాంతంలో రూ.6 కోట్ల విలువైన హెరాయిన్ దాచినట్లు గుర్తించారు. 900 గ్రాములు ఉన్న ఈ హెరాయిన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ యాక్ట్ కింద పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.మరి.. ఈఘటనపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.