రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో జైలు కూడా పంపిస్తారు. అయితే ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారికి పోలీసులు చలాన్లు విధిస్తుంటారు. పోలీసులు విధించిన జరిమానాను కొందరు కట్టేస్తారు. అయితే పెండింగ్ చలాన్లు రాబట్టేందుకు ప్రభుత్వాలు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో పెండింగ్ చలాన్లు విషయంలో ప్రభుత్వాలు వాహనదారులకు బంపర్ ఆఫర్ లు ప్రకటించాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఈ మధ్యకాలంలో పెండింగ్ చలాన్లు భారీగా పెరిగిపోతుండటంతో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. పెండింగ్ చలాన్లు రికవరి చేసేందుకు పలు రకాల ఆఫర్స్ ను ట్రాఫిక్ పోలీసులు ప్రకటిస్తున్నారు. అలానే కర్ణాటక ప్రభుత్వం పెండింగ్ చలాన్లు రికవరీ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో వాహనదారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆఫర్ ఇచ్చింది. ఫిబ్రవరి 11 వరకు చలాన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులు పేటిఎం, ఇతర ఆన్ లైన్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
అందరికీ న్యాయం చేకూర్చేలా ట్రాఫిక్ జరిమానాలపై రాయితీ కల్పించాలని కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తీర్మానం చేసింది. ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు ఈ ప్రతిపాదన పంపింది. ఈ తీర్మానానికి రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో కర్ణాటక వ్యాప్తంగా ఉన్న పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను రవాణా శాఖ గురువారం విడుదల చేసింది.
ఫిబ్రవరి 11 వరకు చెల్లించే జరిమానాలకు 50 శాతం రాయితీ తప్పకుండా వర్తిస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ ఆఫర్ అనేది ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. రెండో సారి జరిమానాలు చెల్లించేవారికి ఈ ఆఫర్ వర్తించదు. మరి.. తాజాగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆఫర్ తో భారీగా పెండింగ్ చలాన్లు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి. కర్ణాటక ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.