విద్యా బుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లే గాడి తప్పుతున్నారు. బిడ్డలాంటి పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులతో వెధవ వేషాలు వేస్తున్నారు. తాజాగా, ఓ ఉపాధ్యాయుడు తన స్టూడెంట్‌కు లేఖ రాశాడు. ఆ లేఖలో తన ప్రేమను మొత్తం బయటపెట్టాడు. చదివిన తర్వాత లేఖ చింపేయమని కూడా బాలికకు చెప్పాడు. కానీ, బాలిక ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేయకపోవటంతో కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్, సదర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఓ 13 ఏళ్ల బాలిక ఆ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది.
అదే పాఠశాలలో 47 ఏళ్ల వ్యక్తి టీచర్‌గా పని చేస్తున్నాడు. ఆ టీచర్ ఆ 13 ఏళ్ల బాలికపై మనసు పారేసుకున్నాడు. ఎంతలా అంటే.. ఆ బాలికకు లవ్ లెటర్ రాసేంతలా. సదరు ఉపాధ్యాయుడు ఓ రోజు బాలికకు తన మనసు తెలుపుతూ ఓ లవ్ లెటర్ రాశాడు. ఆ లెటర్‌లో తన ప్రేమనంతా ఒలకబోశాడు. ‘‘ నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. చలి కాలం సెలవుల్లో నిన్ను ఎంతగానో మిస్ అవుతాను. సెలవులకు ముందు ఓ సారి నా దగ్గరకు రా.. నా నెంబర్ ఇస్తాను. వీలున్నపుడు ఫోన్ చేస్తూ ఉండూ.. ఈ లెటర్ చదివిన తర్వాత చింపేసేయ్’’ అని లేఖలో రాశాడు. తర్వాత దాన్ని ఆమెకు అందించాడు. ఆ లెటర్ చదివిన బాలిక ఆశ్చర్యపోయింది. దాన్ని చింపకుండా ఇంటికి తీసుకుపోయింది. దాన్ని తల్లిదండ్రులకు అందించింది.
అందులో ఉన్నదంతా తన తల్లిదండ్రులకు చదివి వినిపించింది. దీంతో వారు ఆ టీచర్‌ను నిలదీశారు. చేసిన తప్పుకు క్షమాపణ కోరమన్నారు. అయితే, ఇందుకు ఆ టీచర్ ఒప్పకోలేదు. క్షమాపణ చెప్పలేదు. తిరిగి బాలిక తల్లిదండ్రుల్నే బెదిరించాడు. తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. బాలికను కనిపించకుండా చేస్తానన్నాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురికి లేఖ రాసిన టీచర్‌పై ఫిర్యాదు చేశారు. తమ కూతుర్ని సదరు టీచర్ తరచుగా వేధిస్తున్నాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.