పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని ఘటన. ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఘనం జరుపుకోవాలనుకుంటారు. ఇలా నిత్యం అనేక పెళ్లి జరుగుతుంటాయి. కానీ.. కొన్ని పెళ్లిళ్లు మాత్రం వార్తలో నిలుస్తాయి. కారణం.. ఆ పెళ్లిలో ఏదో ఒకటి ప్రత్యేకత ఉండే ఉంటుంది. అలానే బీహార్ లో జరిగిన ఓ పెళ్లి కూడా వార్తలో నిలిచింది. మరి.. అక్కడ ప్రత్యేక ఏమిటి అనుకుంటున్నారా?. ఇద్దరు మరగుజ్జులు వివాహ బంధంతో ఒక్కటైనారు. ఈ జంటను చూడటానికి చుట్టపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలు జనాలు వెళ్లారు. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బీహార్ రాష్ట్రంలోని భగల్ పూర్ జిల్లాలోని విందేశ్వరి మండలానికి మష్రు గ్రామానికి చెందిన వరుడు మున్నా(26), అభియా బజార్‌కు చెందిన కిషోరి మండల్ కుమార్తె మమత కుమారి (24)ని వివాహం చేసుకున్నాడు. 36 అంగుళాల ఈ అబ్బాయి, 34 అంగుళా ఈ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటైనారు. ఈ అరుదైన జంట వివాహం చూడటానికి చుట్టుపక్కల నుంచి కూడా జనం అధిక సంఖ్యలో వచ్చారు. ఇలాంటి పెళ్లి జరగడం తమ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉందని పలువురు గ్రామస్తులు తెలిపారు. ఇది చూడటానికి బాల్య వివాహంలాగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ జంటతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.
” నేను డ్యాన్స్ పార్టీలో ఆర్టిస్ట్ గా పనిచేస్తాను. ఈ వివాహం జరగడం చాలా సంతోషంగా ఉంది. నా భార్యను ఏ కష్టం రాకుండా, సంతోషంగా చూసుకుంటా. మా ఇద్దరి మధ్యఎటువంట సమస్యలు రానివ్వును” అని వరుడు మున్నా తెలిపారు. “నేను సర్కస్ లో పనిచేస్తాను. మున్నాను చూడగానే నాచ చెల్లెలికి అతడే కరెక్ట్ అని అనుకున్నాను. అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిద్దరికి వివాహం నిశ్చయించాను” అని వధువు సోదరి ఛోటూఛలియా తెలిపారు.మరి.. ఈఅరుదైన జంట వివాహం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.