ఇటీవల దేశంలో పలు చోట్ల బీభత్సమైన వర్షాలు పడ్డాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల రాళ్ల వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వడగళ్ళ వానకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పంట నష్టంతో విల విలాడిపోతున్నారు. కొన్ని చోట్లు పిడుగు పాటుకు పశువులు కూడా మరణించాయి.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్న విసయం తెలిసిందే. మార్చి నెలలో మొన్నటి వరకు భగ భగ మండిన సూర్యుడు ఒక్కసారే చల్లబడిపోయాడు. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల రాళ్ల వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఈ క్రమంలో ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది.
దేశంలో ప్రస్తుతం పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట నష్టంతో పాటు పశువులు కూడా మరణించడంతో రైతులు లబో దిబో అంటున్నారు. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో విషాదం చోటు చేసుకుంది.. ఖట్టూఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు పడి 350 పైగా మేకలు, గొర్రెలో మరణించాయి. బర్సూ గ్రామానికి చెందిన రైతు సంజీవ్ రావత్ తన స్నేహితుడు అయిన రిశికేష్ తో కలిసి ఉత్తరకాశీ నుంచి మేకల మందను తీసుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఖట్టూ ఖాల్ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే భారీ వర్షం పడుతుంది.. అయినప్పటికీ సంజీవ్ మేకల మందను తరలిస్తూనే ఉన్నాడు.
ఒక్కసారిగా ఉరుములు-మెరుపులతో కూడా భారీ వర్షం రావడం మొదలైంది… అదే సమయంలో ఎత్తైన పైన్ చెట్టుపై భారీ పిడుగు పడింది.. శక్తివంతమైన పిడుగు ధాటికి మందలో ఉన్న 350 పైగా మేకలు, గొర్రెలు అక్కడిక్కడే మరణించాయి. సంజీవ్ రావత్ లబో దిబో అంటూ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నా అధికారులు. జరిగిన పూర్తి నష్టాన్ని అంచనా వేసి ఒక నివేదికను జిల్లా కలెక్టర్ కి అందజేస్తామని విపత్తుల నిర్వహణ విభాగం అధికారి తెలిపారు. ఇప్పటి వరకు పిడుగు పాటుకు ఇరవై ముప్పై మేకలు, గొర్రెలు మరణించిన వార్తలు విన్నాం.. ఉత్తరకాశీలో ఏకంగా పిడుగు పాటుకు 350 జీవాలు మరణించడం విచారకరం అని అధికారులు అంటున్నారు.