అన్ని ధరలూ పెరుగుతున్నాయి. పెట్రోల్, వంట గ్యాస్, వంట నూనె, కూరగాయలు, ఇంట్లో వంట సరుకులు ఇలా అన్ని వస్తువుల ధరలూ పెరుగుతున్నాయి. కానీ సాధారణ మనిషి ధర మాత్రం పెరగడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది సగటు మనిషి జీవితం. చాలీ చాలని జీతాలు, జీవితాలతో సాధారణ మనుషులు బతుకుబండ్లనీడుస్తున్నారు. ఆర్ధిక వైకల్యం అనే చక్రంలో ఇరుక్కుపోయి సగటు మనిషి బతుకు బండిని ఈడుస్తున్నాడు. అయితే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? మనిషి విలువ పెంచడం కంటే గొప్ప పని చేస్తాయి. ఉచితాలు ఇచ్చి విశాల హృదయాన్ని చాటుకుంటాయి. తాజాగా రేషన్ కార్డు ఉన్నవారికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.
సంక్షేమం అనేది ఒకటుంది. దేశం మొత్తం మీద ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. కొన్ని పథకాలు వర్తించాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అందులో కూడా రకాలు ఉన్నాయి. పీహెచ్హెచ్, ఏఏవై, ఏపీఎల్, బీపీఎల్ ఇలా రేషన్ కార్డుల్లో రకాలు ఉన్నాయి. అయితే అన్ని రేషన్ కార్డుదారులకు 3 గ్యాస్ సిలిండర్లు రావు. కేవలం ప్రభుత్వం నిర్దేశించిన రేషన్ కార్డుదారులకి మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు చేకూరతాయి. నిర్దేశించిన రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. రేషన్ కార్డు ఉన్న వారికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఆర్ధిక సంవత్సరం 2022-23కి గాను అంత్యోదయ రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 3 గ్యాస్ సిలిండర్లు పొందవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం అంత్యోదయ రేషన్ కార్డ్ ఉన్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాఖండ్ కి చెందిన వారికి మాత్రమే ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. అంత్యోదయ రేషన్ కార్డు ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ తో లింక్ అయి ఉండాలని ప్రభుత్వం తెలిపింది.
మొదటి సిలిండర్ ను ఏప్రిల్-జూలై మధ్యలో, రెండవ సిలిండర్ ను ఆగస్ట్-నవంబర్ మధ్యలో, మూడవ సిలిండర్ ను డిసెంబర్-మార్చ్ మధ్యలో ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2 లక్షల మంది అర్హులకి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా సుమారు రూ. 55 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ ప్రజలకు ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంతో వారికి దీపావళి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. పోన్లే ప్రభుత్వం ఇలా అయినా వారికి కాస్త రిలీఫ్ నిస్తుంది. లేదంటే గ్యాస్ సిలిండర్ కొనాలంటే నిరుపేదలకి ఎక్కడ సాధ్యపడుతుంది. ప్రభుత్వం ఎలాగూ వారి బతుకుల్ని మార్చలేదు. కనీసం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని అయినా నెరవేరిస్తే అదే పది కోట్లు.
Free Gas Cylinders: రేషన్ కార్డ్ హోల్డర్లకు శుభవార్త.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు..! #gascylinder #lpgcylinder #businessnews https://t.co/zfdBNs5bcE
— oneindiatelugu (@oneindiatelugu) October 7, 2022