గురువారం శ్రీరామనవమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీతారాముల కళ్యాణ వేడుకను కన్నులారా చూసి భక్తులు తరిస్తున్నారు. వాడవాడలా రాముల వారి కళ్యాణ వేడుక ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలు భక్తులు రామాలయాలకు తరలి వెళ్తున్నారు. అయితే ఇండోర్ లోని ఓ ఆలయంలో నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.
గురువారం శ్రీరామనవమి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీతారాముల కళ్యాణ వేడుకను కన్నులారా చూసి భక్తులు తరిస్తున్నారు. వాడవాడలా రాముల వారి కళ్యాణ వేడుక ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలు భక్తులు రామాలయాలకు తరలి వెళ్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం సీతారాముల కళ్యాణ వేడుకులు అంగరంగ వైభంగా జరిగాయి. అయితే పలు చోట్ల నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణకు ప్రాంతంలో వేణుగోపాల స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో కూడా నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లోని భలేశ్వర్ మహదేవ్ మందిర్ లో అపశృతి చోటుచేసుకుంది.ఆలయ ప్రాంగంణంలో ఉన్న 50 అడుగుల బావిపై కప్పు కూలిపోయింది. ఆ సమయంలో బావిపై నిల్చున్న భక్తులు అందులో పడిపోయారు. బావిపై నిల్చుకున్న 25 మంది భక్తులు అందులో పడిపోయినట్లు సమాచారం. దీంతో స్థానికులు వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బృందం ఘటన స్థలానికి చేరుకుంది. బావిలో పడిపోయిన వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలువురిని బయటకు తీసిన రెస్క్యూ టీమ్ .. ఆస్పత్రికి తరలించింది. మిగిలిన వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ సహాయ చర్యలు కొనసాగిస్తుంది.