గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది బోరు బావులు వేయించి అవి పూడ్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఈ తప్పిదాలు కొంత మంది చిన్నారుల ప్రాణాలు తీసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. . అప్పటి వరకు తమ కళ్లముందు ఆడుకుంటూ ఉన్న చిన్నారులు.. బోరుబావిలో పడి నరకం అనుభవించి చనిపోయి ఘటనలు తలుచుకుంటే కన్నీరు ఆగదు. కొంత మంది పిల్లలు మాత్రం అతి కష్టం మీద ప్రాణాలతో బయట పడుతుంటారు. ఓ రెండేళ్ల బాబు అనుకోకుండా బోరుబావిలో పడిపోయాడు. రిస్క్యూ టీమ్ ఆ చిన్నారిని కష్టపడి బయటకు తీశారు. గుజరాత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇది చదవండి: వీడియో: కాళ్లుచేతులు కట్టేసి.. బిడ్డను ఎర్రటి ఎండలో పడేసిన తల్లి!
గుజరాత్ లో ఓ రెండేళ్ల చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఎప్పటి నుంచో ఉన్న పాడుబడ్డ బోరు బావిలో పడిపోయాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకుంటున్న ఆ చిన్నారి కనిపించకుండా పోవడం.. దగ్గరలో బోరు బావి ఉండటాన్ని గమనించి తల్లిదండ్రులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి వైద్య సిబ్బందితో పాటు రిస్క్యూటీమ్ దాదాపు గంట పాటు శ్రమించి బాలుడిని రక్షించారు. వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాబు సురక్షితంగా ఉన్నాడని ధృంగాధ్ర పరిపాలన అధికారి ఎంపీ పటేల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Swiggy Boy: వైరల్ వీడియో: ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్.. అకారణంగా స్విగ్గీ బాయ్‌పై దాడి..
గ్రామాల్లో ఇప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఈ విషయంపై ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పాత బోరు బావులను పూర్తిగా కప్పివేయాలని సూచిస్తున్నారు. కానీ కొంత మంది నిర్లక్ష్యంతో ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.