ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకు వెళ్లకపోయినా, కారులో సీటు బోల్డు తగిలించుకోకున్నా చలానాలా రూపంలో వేలకు వేలు జరిమానా కట్టాల్సి వస్తుంది. అయితే ద్వి చక్ర వాహనదారుడికి వింత ఫైన్ వచ్చింది.
ఇటీవల రహదారులపై వాహన దారులు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకు వెళ్లకపోయినా, కారులో సీటు బోల్డు తగిలించుకోకున్నా చలానాలా రూపంలో వేలకు వేలు జరిమానా కట్టాల్సి వస్తుంది. సిగ్నల్స్ దగ్గర జిబ్రా క్రాసింగ్ దాటి వాహనాలు కొంచెం ముందుకు వెళ్లిందా అంతే సంగతులు.. ఫోటోలు క్లిక్ మనిపించేస్తున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్స్. ఫైన్ల రూపంలో చలానాలు ఇంటికి కూడా వచ్చేస్తాయి. అయితే ద్విచక్ర వాహనదారుడికి సీటు బెల్డ్ పెట్టుకోలేదంటూ మేసేజ్ రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. అదీ కూడా మూడేళ్ల క్రితం నాటి చలానా కావడం గమనార్హం.
బీహార్‌లో ఓ ద్విచక్ర వాహనదారుడు సీటు బెల్టు పెట్టుకోనందుకు విచిత్రమైన ట్రాఫిక్ చలాన్ అందుకున్నాడు. సమతిపూర్‌లో 2020లో ట్రాఫిక్ ఉల్లంఘించినట్లు ఈ చలానా వచ్చిందని, ఇప్పటికే చలానా ఫైన్ కట్టేసినట్లు తెలిసిందని వాహనదారుడు కృష్ణకుమార్ ఝా తెలిపారు. ‘నా దగ్గర స్కూటీ ఉంది . ఏప్రిల్ 27న నేను బెనారస్ (వారణాసి) వెళుతున్నాను. నేను రైలులో ఉన్నప్పుడు, నా పేరుపై ₹ 1,000 చలానా జారీ అయిందని మేసేజ్ వచ్చింది. వివరాల కోసం చూసినప్పుడు.. 2020లో సీటు బెల్డ్ పెట్టనందుకు ఈ జరిమాన విధించినట్లు పేర్కొనబడి ఉంది’ అని కృష్ణ కుమార్ తెలిపారు.
స్కూటర్‌కు సీటు బెల్డ్ పెట్టుకోనందుకు ఫైన్ పడితే.. ఆ చలానా కట్టేసినట్లు ఉండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. తనకు తెలిసి తానైతే కట్టలేదని అన్నారు. దీనిపై అధికారులను సంప్రదించగా.. ఏదో సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగి ఉండవచ్చునని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే ఆయన అందుకున్న చలాన్ మాన్యువల్‌గా జారీ చేయబడిందని, ఇప్పుడు, మేము వీటన్నింటినీ ఈ-చలాన్‌లుగా అందిస్తున్నామని, లోపం ఎక్కడ జరిగిందో తనిఖీ చేస్తామని అని బీహార్ ట్రాఫిక్ పోలీసు అధికారి బల్బీర్ దాస్ చెప్పారు. కాగా, ఫిబ్రవరిలో ఒడిశా నుండి ఇదే విధమైన సంఘటన చోటుచేసుకుంది. అభిషేక్ కర్ తన ద్విచక్రవాహనం నడుపుతున్నప్పుడు సీటుబెల్ట్ ధరించనందుకు ₹ 1,000 జరిమానా విధించారు.