నడి రోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన ఇద్దరు అబ్బాయిలు.. ఇదేం కల్చర్ రా నాయనా.?

సోషల్ మీడియా వచ్చాక.. ఫేమస్ అయ్యేందుకు పలు రకాల ప్రయత్నాలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు కొంత మంది కుర్రకారు . బహిరంగ ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తూ..ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ఏ విషయంలోనూ తీసిపోవడం లేదు. అటువంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

వెర్రీ వెయ్యి రకాలు అనేది సామెత. ఈ రోజుల్లో యువత చేస్తున్న చేష్టలను చూస్తుంటే అది నిజమే కాబోలు అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక.. ఫేమస్ అయ్యేందుకు పలు రకాల ప్రయత్నాలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తూ..ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం తీసిపోవడం లేదు. బైకులపై చిత్ర, విచిత్ర విన్యాసాలు చేస్తూ వీడియోల్లో దొరుకుతున్నారు. మొన్నటికి మొన్న ఓ యువతిని బైక్ ముందు భాగంలో కూర్చొపెట్టుకుని, బండి తోలుతూ, రొమాన్స్ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. అలాగే ఇద్దరు అమ్మాయిలు లిప్ కిస్‌, హగ్గులతో నడి రోడ్డుపై రెచ్చిపోయిన సంగతి విదితమే. ఏం మేమన్నా తక్కువ తిన్నామా అని అనుకున్నారేమో ఏమో ఇద్దరు అబ్బాయిలు నడి రోడ్డుపై గాఢ చుంబనాలు చేసుకుంటూ .. వీడియోకు దొరికిపోయారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఇద్దరు వ్యక్తులు స్కూటీలో వెళుతుండగా ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం కెమెరాకు చిక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో మొత్తం ముగ్గురు యువకులు బండిమీద వెళుతుండగా.. మధ్యలో కూర్చొన్న వ్యక్తి.. వెనుక కూర్చొన్న వ్యక్తి కలిసి లిప్ కిస్ పెట్టుకున్నారు. ఇది వెనుక నుండి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట్ల హల్ చల్ చేయడంతో పాటు.. పోలీసులు దృష్టికి చేరింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సన్సార్ సింగ్ మాట్లాడుతూ, ‘సంఘటన ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, కానీ వారిపై చర్యలు తీసుకుంటాం. వాహనం కదులుతున్న సమయంలో అబ్బాయి వెనుకకు తిరిగాడు, ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలను కూడా ఉల్లంఘించారు’ అని పోలీసులు తెలిపారు. రాంపూర్ సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, ముగ్గురిని వెతుకుతున్నామని, అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఇదేం కల్చర్ రా నాయనా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతుంటే.. కొంత మంది సీరియస్ కామెంట్స్ పెడుతున్నారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed