ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం దస్నా జైలులో ఎయిడ్స్ వ్యాధి పెద్ద ఎత్తున కలకలం సృష్టించింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 140 మంది ఖైదీలు ఎయిడ్స్ భారిన పడ్డారు. ప్రస్తుతం ఈ జైలులో 5500 మంది ఖైదీలు ఉండగా అందులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. ఈ విషయాని దస్నా జైలు సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం జైలులోని ఖైదీలను తరలించే మందు హెచ్ఐవీ పరీక్ష చేస్తామని.. ఈ క్రమంలోనే ఈ ఘటన వెలుగు చూసిందని అధికారులు అంటున్నారు.
ఇటీవల దస్నా జైలుకి 250 మంది కొత్త ఖైదీలు రావడం జరిగిందని.. అందులో నలుగురికి ఎయిడ్స్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ పరీక్ష చేయగా 140 ఖైదీలకు ఎయిడ్స్ ఉన్నట్లు తేలిందని డాసనా జైలు ఎస్పీ అలోక్ సింగ్ తెలిపారు. కాగా, 2016 నుంచి జైళ్లలో హెచ్ ఐవీ స్క్రీనింగ్ క్యాంపులను రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ శాఖ వారు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ జైలులో 49 మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధాన కావడంతో సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా హెచ్ఐవీ, టీబీ టెస్ట్స్ తప్పని సరిగా చేపడుతు వస్తున్నారు.
వాస్తవానికి ఘజియాబాద్ జైలుకు కేవలం 1706 మంది ఖైదీల సామర్థ్యం మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అక్కడ 5500 మంది ఖైదీలను ఉంచినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అందులో 140 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకగా.. వారిలో కొంత మందికి క్షయా వ్యాధి సైతం సోకిందని అంటున్నారు. జైలు లో పెద్ద సంఖ్యలో ఖైదీలు చేరడంతో ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడం సవాలుగా మారుతుందని.. ఈ వ్యాధి ఎలా ప్రబలుతుందన్న విషయంపై ఆరా తీస్తున్నామని.. ఖైదీలకు హెచ్ఐవీ రాకుండా అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు జైలు ఎస్పీ అలోక్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
UP | HIV has been confirmed in 140 prisoners lodged in Ghaziabad’s Dasna Jail. At the same time, 17 TB patients have also been confirmed. The jail’s capacity is 1704 prisoners, while 5500 prisoners have lodged in the district jail: AK Singh, Dasna Jail Superintendent Ghaziabad pic.twitter.com/eKodX3oeii
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 17, 2022