చిన్న పిల్లలు ఏ విషయాన్నైనా ఇట్టే పట్టేయగలరు. వీరిలో నేర్చుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. అందులోనూ సృజనాత్మక వైపుగా ఆలోచిస్తుంటారు. చాలా మంది చిన్నారులు తమదైన శైలిలో ప్రతిభావంతులుగా నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు. చదువుల్లో మేటిగా నిలవడంతో పాటు ఆట పాటల్లో ఆరి తేరున్నారు. అద్బుతాలు సృష్టిస్తున్నారు
చిన్నపిల్లల్లో సృజనాత్మకత ఎక్కువ. వారితో సాధన చేయించాలే కానీ చిన్న వయస్సులోనే అద్భుతాలు సృష్టించగలరు. ఏదైనా ఇట్టే పట్టేయగలరు. ఇప్పటికే చాలా మంది చిన్నారులు తమదైన శైలిలో ప్రతిభావంతులుగా నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు. చదువుల్లో మేటిగా నిలవడంతో పాటు ఆట పాటల్లో ఆరి తేరున్నారు. కేవలం వీరు చదువులకే పరిమితం కావడం లేదు. పలు నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. సృజనాత్మక కళా రంగాల్లోనే కాదూ.. శాస్త్ర, సాంకేతికలోనూ తమ దృష్టిని సారిస్తున్నారు. అద్బుతాలను సృష్టిస్తున్నారు. అటువంటి వారిలో కేరళకు చెందిన చిన్నారి ఒకరు. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఈ చిన్నారికి సరిపోతుంది. ఆమె చేసిన ఆవిష్కరణను చూసి అబ్బురపరిచేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే…
నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఇప్పుడు ఇదే కంటికి సంబంధించిన వ్యాధులను గుర్తించేందుకు ఓ చిన్నారి అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. ఇంతకు ఆ చిన్నారి పేరు లీనా రఫీక్. కేరళకు చెందిన ఈ 11 ఏళ్ల చిన్నారి ఐఫోన్ సాయంతో కంటి వ్యాధులను గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అప్లికేషన్(యాప్)ను రూపొందించి రికార్డు సృష్టించింది. లీనా తన ఆవిష్కరణను లింక్డ్ ఇన్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. సెల్ఫ్ కోడర్ యాప్‌ను ‘ఓగ్లర్ ఐ స్కాన్’(Ogler EyeScan) అని పేరు పెట్టింది. వీడియోలో తన అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో కూడా వివరించింది. ఆమె అభివృద్ధి చేసిన యాప్‌తో ఆర్కస్, మెలనోమా, టెరీజియం, క్యాటరాక్ట్ వంటి కంటి వ్యాధులను గుర్తించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. 10 ఏళ్ల వయసులోనే ఈ యాప్‌లో పనిచేయడం ప్రారంభించింది.
కంప్యూటర్ విజన్, అల్గారిథమ్‌లు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ఐ కండిషన్స్, యాపిల్ ఐఓఎస్‌లోని అధునాతన టెక్నాలజీతో సహా వివిధ విషయాలను అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందన్న లీనా.. సుమారు ఈ యాప్ తాను రూపొందించడానికి దాదాపు 6 నెలల సమయం పట్టిందని తెలిపింది. ఆ తర్వాత యాప్‌ను ఆప్ స్టోర్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. ప్రస్తుతం లీనా షేర్ చేసిన ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సమాజానికి ప్రయోజనకరమైన యాప్‌ను క్రియేట్ చేసినందుకు చిన్నారిపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘వావ్, అద్భుతంగా ఉంది! మీరు ఓగ్లర్ ఐ స్కాన్‌ను సృష్టించినందుకు అభినందనలు’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఐపోన్ 10 ప్లస్ ఐఒఎస్ ఫోన్లతో మాత్రమే పనిచేస్తుందని తెలిపింది. చిన్నారి ప్రతిభ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.