దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నూతన సంవత్సర వేళ దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో అంజలి అనే యువతిని కారుతో ఢీ కొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం విధితమే. ఈ కేసు విషయంలో 11 మంది పోలీసులపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరీయస్ గా తీసుకుంది. ఈక్రమంలోనే 11 మంది పోలీసులపై సప్పెన్షన్ వేటు వేసింది. జనవరి 1న జరిగిన ఈ దారుణమైన ఘటనలో అంజలి అనే యువతి మృతి చెందింది. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కంఝూవాల రోడ్డు ప్రమాద కేసుపై కేంద్ర హోం శాఖకు సమగ్రమైన నివేదిక అందింది. ఆ నివేదిక ఆధారంగా ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జనవరి 1న విధులు ముగించుకుని అంజలి సింగ్ అనే యువతి స్కూటీపై ఇంటికి వెళ్తుంది. ఇదే సమయంలో అంజలి స్కూటీని కొందరు కారుతో ఢీకొట్టారు. అనంతరం యువతిని సుల్తాన్ పూర్ నుండి కంఝవాలా వరకు సుమారు 13 కిలోమీటర్లు ఆమెను కారుతో ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో అంజలి వెనుక కూర్చున్న ఆమె స్నేహితురాలు నిధికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఢిల్లీ పోలీసులు ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకున్నారు. నిందితులు దీపక్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను జ్యూడిషీయల్ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఇదే సమయంలో కంఝవాల కేసుపై కేంద్ర హోం శాఖ స్పందించింది.
ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్రం హోం శాఖ అందుకుంది. ఆ నివేదిక ఆధారంగా ఘటన జరిగిన రోజున విధుల్లో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుండి ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. కేంద్రం హోంశాఖ సిఫారసు మేరకు 11 మందిపై పోలీసులపై ఢిల్లీ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. అంతేకాక ఈ కేసు దర్యాప్తు సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు కూడా నోటీసులు జారీ చేయాలని కేంద్రం హోంశాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు సూచించింది. అలానే ఈ కేసుపై త్వరగా చార్జీషీట్ దాఖలు చేయాలని కూడా కేంద్రం ఆదేశించింది.
ప్రస్తుతం ఢిల్లీలో అమల్లో ఉన్న పీసీఆర్ పద్ధతిని పూర్తిగా మార్చాలని కూడా కేంద్రం కోరింది. ఇక కంఝూవాల రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన నివేదికను అందించే బాధ్యతను ప్రత్యేక కమిషనర్ షాలిని సింగ్ కి కేంద్ర హోంశాఖ అప్పగించింది. మరి.. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కేంద్ర వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#DelhiHorror: Cops rule out the foul play in Delhi’s ‘hit-and-run’ case; know more about what happened 90 minutes before@AnvitSrivastava with more details
(@GrihaAtul)#Delhi #HitAndRun pic.twitter.com/NA1QbzvZ4P
— News18 (@CNNnews18) January 3, 2023