పుట్టుక, చావుల సన్నని గీతే మనిషి జీవితం. పుట్టుకతో ఏమీ తీసుకురాము, చనిపోయాక ఏం తీసుకెళ్లలేం. ఏం చేసినా, ఏం చూసినా, ఏం సాధించినా ఆ రెండింటి మధ్యే. జన్మ, మరణాలు మన చేతుల్లో ఉండవు. పుట్టాక జీవితం ఎలా ఉండుందో తెలుసు కానీ, మరణించాక మనిషి ఏమోతారు, ఆత్మ ఏమోతుందో ఇప్పటికి అంతుపట్టని రహస్యం. స్వర్గం, నరకాలు ఉంటాయని మన పురాణాల్లో చెబుతుంటారు కానీ.. చూశామని చెప్పినా దాఖలాలు లేవు. ఓ మనిషి విలువ చనిపోయాక తెలుస్తుందంటారు పెద్దలు. మనిషి చనిపోయాక తిరిగి రావడమేనది కల్ల. కానీ చనిపోయాక, అంత్యక్రియలకు సిద్ధం చేసుకున్నాక.. ఆ మనిషి లేస్తే..ఆనంద పడాలో, ఆశ్చర్యపడాలో వంటి అయోమయ పరిస్థితులు కుటుంబ సభ్యులు ఎదుర్కోవాల్సిందే.
అటువంటి ఘటనే ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. చనిపోయిందనుకున్న బామ్మ, ఆరు ఏడు గంటల త్వరాత లేచి కూర్చుంది. దీంతో అవాక్కవడం బంధువుల వంతైంది. ఆ బామ్మ పేరు జ్ఞాన్ దేవి, ఆ బామ్మకు వయసు ఎంత అనుకుంటున్నారు. 109 ఏళ్లు. రూర్కీలోని మంగ్లోర్ లోని నర్సన్ ఖుర్ద్ అనే చిన్న గ్రామంలో బామ్మ కుటుంబం నివసిస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపుడుతున్న ఆమె గత నెల 31న ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. మనవడు వినోద్, అల్లుడు మంగే రామ్ డాక్టర్ పిలువగా.. పరిశీలించిన ఆయన బామ్మ చనిపోయినట్లు నిర్ధారించారు. ఒక్కసారిగా బాధపడ్డ కుటుంబం.. అంత్యక్రియలు అన్ని సిద్దం చేసుకుంటుంది.
కుటుంబ సభ్యులంతా వచ్చి ఏడుస్తున్నారు. బామ్మ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు అన్ని సిద్ధం చేయగా.. ఆమె శరీరంలో చలనం కనిపించింది. ఆమె శరీరం కదలడంతో.. బామ్మను పిలిచారు. దీంతో ఆమె ఒక్కసారి లేచి కూర్చుంది. ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు, వెంటనే తెరుకుని ఏమైనా తింటావా అని అడగ్గా.. ఏం సమాధానం రాలేదు. రసగుల్లా తింటావా, చాట్ తింటావా అని అడగ్గా.. చాట్ తింటానని సమాధానం చెప్పింది. వెంటనే చాట్ తెచ్చి బామ్మకు తినిపించారు. కాగా, ఆమె తిరిగి లేవడంపై అల్లుడు మంగే రామ్ మాట్లాడుతూ.. ఇదంతా 6-7 గంటల్లోనే జరిగిందన్నారు. అదొక మిరాకిల్ లా అనిపించిందని, ఆమె కళ్లు తెరిచి, లేచి కూర్చునే సరికి తామెంతో ఆనందించినట్లు చెప్పారు. మరణించిందనుకున్న బామ్మ లేచి.. చాట్ తినడం వింతే.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి