రోడ్లు ఓ దేశ అభివృద్ధికి చిహ్నాలు. రవాణా మార్గాలు సరిగా ఉంటేనే ఆ ప్రాంతం బాగా ఆభివృద్ధి చెందుతుంది. పూర్వ కాలం నుంచి కూడా నాగరికత వెల్లి విరియడానికి, అభివృద్ధి చెండానికి రోడ్లు ప్రధాన పాత్ర పోషించాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు రవాణా మార్గాల అభివద్ధి కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు కూడా చేస్తాయి. ప్రభుత్వాలు ఎంత చేసినా గుంతలు లేని రోడ్లు అనేది మన దగ్గర అతి పెద్ద సవాల్.
కొంతమంది ప్రైవేట్ కాంట్రాక్టర్లు తమ స్వ లాభం చూసుకుని.. ఏదో వేశామా అంటే వేశాం అన్నట్లు రోడ్లు వేసి చేతులు దులుపుకుంటారు. ఇక వర్షాకాలం వస్తే.. వాటి బాగోతం బయటపడుతుంది. పది చినుకులు పడితే చాలు గుంతలు ఏర్పడి.. రోడ్ల మీద చెరువులు దర్శనం ఇస్తాయి. దీనిపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవు. ఫలితంగా ప్రజా ధనం నిరుపయోగం కావడమే కాక.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
దేశవ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు చూడబోయేది అంతకన్నా అధ్వాన్నమైన పరిస్థితి. రోడ్డు మీద చిన్న చిన్న గుంతలు ఉంటేనే ఎంతో ఇబ్బంది పడతాం.. అలాంటిది ఏకంగా స్విమ్మింగ్ ఫుల్ సైజులో గుంతలు ఏర్పడి.. అసలు అక్కడ రోడ్డు ఉందా అనే అనుమానం వస్తుంది ఈ వీడియో చూస్తే. ఇక ఇంత అధ్వానమైన రోడ్లు ఉన్నది బిహార్‌లో. దీనిపై రాజకీయ వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలువుతోంది. ఆ వివరాలు..
మధుబని జిల్లా జాతీయ రహదారి 227 పై 20 కిలోమీటర్ల మేర విస్తరించిన రోడ్డుపై ఒకటి, రెండు కాదు.. ఏకంగా 100 గుంతలు అది కూడా స్విమ్మింగ్ ఫైల్ సైజ్‌లో ఉన్నాయి. ఇక ఈ రోడ్డు ఉన్న ప్రాంతంలో 15 వేల కుటుంబాలు.. 500 వరకు చిన్న దుకాణాలు ఉన్నాయి. ఇక 2015 నుంచి ఈ రోడ్ల పరిస్థితి ఇలానే ఉండగా.. ప్రజలు అప్పటి నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ధైనిక్ భాస్కర్ వార్త ప్రతికకు చెందిన ప్రవీణ్ ఠాకూర్ అనే వ్యక్తి ఏరియల్ వ్యూ ద్వారా తీసిన ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇతి తెగ వైరలువతోంది. దీన్ని చూసిన నెటిజనులు.. డబుల్ ఇంజీన్ అభివృద్ధి అంటే ఇదేనేమో.. ఈ రోడ్లు అచ్చం తకేషీ క్యాస్టిల్ అనే గేమ్ ఫోను తలపించే విధంగా ఉన్నాయి.. నితిన్ గడ్కరీ బిహార్‌లో రోడ్ల అభివృద్ధి ఎంతో వేగంగా ఉందని.. 2024 డిసెంబర్ నాటికి వీటిని అమెరికా రోడ్లతో సమానంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మరి అమెరికాలో కూడా ఇదే విధంగాఉంటాయా అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక అవకాశం దొరికితే చాలు.. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉండే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీనిపై స్పందిస్తూ.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వీడియోని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన పీకే.. ఈ రోడ్లను చూస్తే.. 90వ దశకంలో బిహార్‌లోని జంగిల్ రాజ్ కాలం నాటి రోడ్లను గుర్తు చేసింది. రాష్ట్రంలో రోడ్లు చాలా బాగున్నాయని.. ఇటీవలే నితీష్ కుమార్ తెలిపారు. దానికి నిదర్శంగా ఈ రోడ్లు నిలిచాయి అంటూ ఎద్దేవా చేస్తూ హిందీలో ట్వీట్ చేశారు.
ఇక ఈ రోడ్డు మరమత్తు కోసం ఇప్పటికే మూడు సార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రక్టర్లు మాత్రం అసంపూర్తిగా పనులు చేసి.. చేతులు దులుపుకుంటున్నారు. మరి నితిన్ గడ్కరీ మాట నిలబెట్టుకుని.. 2024 నాటికైనా రోడ్లను బాగు చేసి.. తమకు విముక్తి కల్పిస్తారా లేదా అని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
90 के दशक के जंगलराज में बिहार में सड़कों की स्थिति की याद दिलाता यह बिहार के मधुबनी जिले का नेशनल हाईवे 227 (L) है।
अभी हाल में ही #Nitishkumar जी एक कार्यक्रम में पथ निर्माण विभाग के लोगों को बोल रहे थे कि बिहार में सड़कों की अच्छी स्थिति के बारे में उन्हें सबको बताना चाहिए। pic.twitter.com/Qp0ehEluty
— Prashant Kishor (@PrashantKishor) June 23, 2022