ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయాలనేది ఎంతోమంది యువకుల కల. బ్యాంక్ ఉద్యోగం కోసం ప్రిపరేషన్, ఎగ్జామ్, మార్కులు ఇదంతా ఎందుకు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తే బాగుంటుంది కదా అనుకునేవారికి ఇది సువర్ణావకాశం. బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ తో పని లేకుండా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఏడాదికి 8 లక్షల ప్యాకేజ్ తో బ్యాంక్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్ లో ఐటీ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ బ్యాంక్ లో జాబ్ కొట్టాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటి? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వయసు పరిమితి ఎంత ఉండాలి? ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి? వంటి వివరాలు మీ కోసం.