గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 1000 పడకలతో ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్-19 ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ తో యావత్ దేశం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఇండియా లో ఉన్న పరిస్థితులని చూసి ప్రపంచ దేశాలు కూడా చలించిపోయ ఎంతో మంది దాతలు దేశానికి మద్దతుగా తమకు తోచినంత సాయం చేసి కరోనాపై జరుగుతున్న పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దేశాన్ని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే రిలయన్స్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సెకండ్ వేవ్ లోనూ రిలయన్స్ ముందుకొచ్చింది దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
ఇదే విషయమై గుజరాత్ ముఖ్యమంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పందిస్తూ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కొవిడ్ హాస్పిటల్ నిర్మాణానికి రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చినట్టు తెలిపింది. మే 2వ తేదీనాటికి తొలి దశలో భాగంగా 400 పడకలతో కొవిడ్-19 హాస్పిటల్ అందుబాటులోకి రానుందని వెల్లడించిన గుజరాత్ సీఎంవో ” సౌరాష్ట్రలోని జామ్‌నగర్, ద్వారకా, పోర్బందర్ జిల్లాల నుంచి వచ్చే కరోనా రోగులకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుంది” అని అభిప్రాయపడింది. మరో రెండు వారాల్లో మరో 600 పడకలు, ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్ కేర్ సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది.
గుజరాత్ లోని జామ్ నగర్ లో ఆక్సీజన్ సదుపాయతో పాటు 1000 వెయ్యి పడకలు ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నాం. మరో వారం రోజుల్లో 400 పడకలు సిద్ధమవుతాయి. మరో రెండు వారాల్లో మిగిలిన 600 బెడ్స్ ఏర్పాటు చేయనున్నాం. ఇక్కడ అందరికీ ఉచితంగానే కరోనా చికిత్స అందిస్తున్నాం. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి మన భారతీయులకు రిలయన్స్ వీలైనంత సాయం చేస్తూనే ఉంది. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం అందరం కలిసి ఈ కరోనా పోరాటంలో విజయం సాధిస్తాం అని నీతా అంబానీ అన్నారు. ఇంకొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా రిలయన్స్ ఆక్సీజన్ సరఫరా చేస్తున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ఈ ప్రకటనలో పేర్కొంది.