అతి తక్కువ ధరలో కరోనా డ్రగ్ తయారు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. ఇందుకోసం నిక్లోసమైడ్ అనే టేప్‌వార్మ్ (నారిపురుగు) డ్రగ్‌ను ఉపయోగించాలని భావిస్తోంది. కరోనా టెస్ట్ కోసం ఈ కంపెనీ ఆర్–గ్రీన్, ఆర్–గ్రీన్ ప్రో పేరుతో తయారు చేసిన చవక కిట్స్ కు ఇది వరకే ఐసీఎంఆర్ నుంచి పర్మిషన్లు వచ్చాయి. చాలా చవగ్గా హ్యాండ్ శానిటైజర్లనూ తయారు చేస్తామని, ప్రస్తుత శానిటైజర్ల రేట్ల కంటే తమ ప్రొడక్టు ధర ఐదో వంతే ఉంటుందని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేసింది.
విదేశాల నుంచి 24 ఆక్సిజన్ కంటెయినర్లను తెప్పించింది. కరోనా చికిత్సలో కొత్త ఔషధాన్ని లాంచ్ చేసే ప్రయత్నల్లో రిలయన్స్ బిజీగా ఉంది. అలాగే చౌక కరోనా టెస్టింగ్ కిట్‌ను కూడా లాంచ్ చేయనుంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ఐదో వంతు తక్కువ ధరకే శానిటైజర్లను తయారుచేసే ప్రణాళికను కూడా రూపొందించింది. ఖరీదైన టెస్టింగ్ కిట్స్, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న లక్షల కొద్దీ బిల్లులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు రిలయన్స్ ప్రయత్నాలు మంచి ఊరటనివ్వనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి రిఫైనింగ్-టు-రిటైల్ గ్రూప్ 3డీ టెక్నాలజీ “స్పెషల్ స్నార్కెలింగ్ మాస్క్” వినియోగిస్తోందని బ్లూం బర్గ్ నివేదించింది. నిమిషానికి 5-7 లీటర్ల సామర్థ్యం కలిగిన గ్రేడ్ ఆక్సిజన్ జనరేటర్లను డిజైన్ చేస్తోందట. గత ఏడాది పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ సీఎం రిలీఫ్ఫం డ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 875 పడకలను అందించింది. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాకు రిలయన్స్ చురుకుగా సహాయం చేస్తోంది.