మానవాళికి గడ్డు కాలం కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే కరోనా వేవ్ లు ప్రపంచాన్ని చుట్టూ ముడుతున్నాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో పెద్దన్న రాజ్యం అమెరికాకి మరో కొత్త సమస్య వచ్చి పడింది. తాజాగా అమెరికాలో మంకీఫాక్స్ కేసు వెలుగు చూసింది. టెక్సాస్ కి చెందిన ఓ వ్యక్తిలో మంకీఫాక్స్ చెందిన లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అతన్ని ఓ హాస్పిటల్ లో ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇతను ఇటీవల నైజీరియా వెళ్లి వచ్చాడని, అక్కడే అతనికి ఈ వ్యాధి సోకినట్టు వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా మధ్య, ఆఫ్రికా దేశాలలో మంకీఫాక్స్ వైరస్ ప్రభావం ఎక్కువ. అక్కడ కొన్ని దశాబ్దాలుగా ఈ కేసులు నమోదు అవుతున్నాయి.
మంకీఫాక్స్ కూడా కరోనాలానే దారుణమైన అంటు వ్యాధి. ఇది కోతుల నుండి మనుషులకు, మనుషుల నుండి మనుషులకు వ్యాపించే వ్యాధి. వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నా, అతన్ని ముట్టుకున్నా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి లక్షణాలు కూడా కాస్త తీవ్రంగానే ఉంటాయి. జ్వరం, జలుబు, తలనొప్పి, వాపు, తలనొప్పి, కండరాల నొప్పి మంకీఫాక్స్ లక్షణాలు. అయితే.., ఇవన్నీ మొదటి దశలో కనిపించే లక్షణాలు మాత్రమే. ఇక రెండో దశలో శరీరంపై బొబ్బలు, దద్దుర్లు ఏర్పడుతాయి. ఈ మొత్తం స్థితి రావడానికి రెండు నుండి మూడు వారాల సమయం పడుతుంది. ఈలోపు రోగి కనుక కోలుకోకుంటే ప్రమాదం తప్పకపోవచ్చు.
కరోనాకి ఎలా అయితే మందు లేదో.., ఈ మంకీఫాక్స్ కి కూడా మందు లేదు. అయితే.., మన దేశంలో స్మాల్ఫాక్స్ కి వాడే యాంటీ డ్రగ్ మంకీఫాక్స్ ట్రీట్మెంట్ లో అద్భుతంగా పని చేస్తోంది. ఇప్పటికైతే అమెరికాలో ఒకే ఒక్క మంకీఫాక్స్ కేసు నమోదు అయ్యింది. నిజానికి అమెరికాకి ఈ మంకీఫాక్స్ కేసులు కొత్త కాదు. 20 ఏళ్ళ క్రితం కూడా అమెరికా ఈ వైరస్ తో పోరాటం చేసి విజయం సాధించింది. మరి.., ఇప్పుడు అమెరికా మంకీఫాక్స్ వైరస్ ని ఎలా ఎదుర్కొంటదో చూడాలి.</p