ఫిల్మ్ డెస్క్- మోనాల్ గజ్జర్.. అంతకు ముందు ఏమో గానీ, బిగ్ బాస్ రియాల్టీ షో ద్వార ఈ ముద్దు గుమ్మ బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ కు ముందు అడపా దడపా సినిమాల్లో హీరోయిన్ గా నటించినా రానంత పేరు, బిగ్ బాస్ ద్వార వచ్చింది మోనాల్ కు. బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోల్లో పాల్గొంది మోనాల్.
ఐతే బిగ్ బాస్ షోకి వచ్చి ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్న వాళ్లలో మోనాల్ గజ్జర్ కూడా ఒకరని చెప్పవచ్చు. బిగ్ బాస్ షో వల్ల మోనాల్ గజ్జర్ కు క్రేజ్ వచ్చినా, ఆ పేరు ప్రతిష్ఠ అంతా నెగిటివ్‌గానే వచ్చింది. బిగ్ బాస్ హౌజ్ లో తొలుత అభిజిత్ తో ఆ తరువాత అఖిల్ తో లవ్ ట్రాక్ నడిపిన మోనాల్ పై ఇప్పటికీ ట్రోలింగ్స్ ఓ రేంజ్‌లో వస్తుంటాయి.
ఐతే వాటిని మోనాల్ ఎప్పుడూ కూడా పెద్దగా లెక్కచేయలేదనే చెప్పాలి. ముందు నుంచి మోనాల్ డేరింగ్ అండ్ డ్యాషింగ్. అందుకే విమర్శలను, ఆరోపణలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. చిన్నప్పటి నుంచి తాను పెరిగిన వాతావరణమే అందుకు కారణమని బిగ్ బాస్ షోలో చాలా సందర్బాల్లో చెప్పింది మోనాల్. తాను ఏ విషయాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటానని చెబుతూ ఉండేది మోనాల్. ఐతే ప్రస్తుతం మోనాల్ ఆ ధైర్యాన్ని కొంత మేర కోల్పోయిందని అనిపిస్తోంది.
తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మోనాల్ గజ్జర్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చింది. ఇంకేముంది నెటిజన్స్ మరోసారి ఆమెను టార్గెట్ చేశారు. డ్రామా క్వీన్ అంటూ బిగ్ బాస్ ఇష్యూని తెరపైకి తెస్తూ మోనాల్ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో సహనం కోల్పోయిన మోనాల్ గజ్జర్ వారిపై సీరియస్ అయ్యింది. అసలు మీకు బుద్ధి ఉందా.. నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మోనాల్. ఒక్కసారిగా లైవ్ లో ఆమె ఏడ్చేసరికి అంతా అవాక్కయ్యారు.