ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. ఏదైన మాట ఠక్కున అనేస్తారనే గాని అందులో నిజం ఉంటుంది. ఈ మధ్య ఆయన ఓ చానెల్ ప్రముఖ హాస్యనటుడు ఆలీ హోస్ట్‌గా ప్రసారమయ్యే ఒక షోలో మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ టాక్ షోలో పలు ఆసక్తికర అంశాలపై మోహన్‌బాబు మాట్లాడారు. ఆయన గతం గురించి, ఆయన నడుపుతున్న విద్యాసంస్థల గురించి కూడా పలు విషయాలు పంచకున్నారు. ఈ క్రమంలో ఆయన అప్‌కమింగ్ మూవీ సన్నాఫ్ ఇండియా సినిమాలోని ఓ డైలాగ్ చెప్పు ఎమోషనల్ అయ్యారు.
‘ఒక లారీ డ్రైవర్ అమ్మాయిని రేప్ చేస్తే 24 గంటల్లో ఎన్‌కౌంటర్ చేశారు. మరీ ఒక బడాబాబు వాడికి పుట్టిన బుడ్డబాబు రేప్ చేస్తే 24 ఏళ్లు అయినా న్యాయం జరగదు.. దటీజ్ ఇండియా’ అంటూ ప్రస్తుత అత్యాచార ఘటనలను ఉటంకిస్తూ ప్రభుత్వాలను విమర్శించేలా డైలాగ్ చెప్పారు. అది సినిమాలో ఒక డైలాగే కావచ్చు. కానీ మోహన్‌బాబు వ్యక్తిత్వం అలాంటిదే అడగాలని పిస్తే ఎంతటివారినైనా కడిగేస్తారు.