షమీకి ఇప్పటికే టెస్టుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన అనుభవం ఉంది. అప్పుడప్పుడు నెట్స్‌లో షమీ గంటల కొద్ది బ్యాటింగ్ చేస్తూ కూడా కనిపిస్తుంటాడు. తన స్లాట్‌లో బంతి పడితే.. ఏమాత్రం కనికరం లేకుండా షమీ సిక్సుకు పంపుతాడు. ముఖ్యంగా టెస్టుల్లో షమీ చేస్తున్న పరుగులు ఎంతో కీలకంగా మారుతున్నాయి.
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ మాస్ బ్యాటింగ్ చేశాడు. అద్భుతంగా ఆడుతున్న అక్షర్ పటేల్‌కు మద్దతుగా నిలుస్తూ.. ఆసీస్ బౌలర్లను కాసేపు వణికించాడు. 7 వికెట్ల నష్టానికి 321 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. హాఫ్ సెంచరీ సాధించి మంచి టచ్‌లో కనిపించిన జడేజా వికెట్‌ను కోల్పోయింది. 70 పరుగులు చేసిన జడేజా టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక్కడి నుంచి అక్షర్ పటేల్-షమీ జోడీ ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌పై ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా షమీ.. తన పవర్ హిట్టింగ్‌తో ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీని భయపెట్టాడు. ఈ మ్యాచ్‌లో అప్పటికే 6 వికెట్లు తీసుకుని, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్‌ను అవుట్ చేసి.. డేంజరస్ బౌలర్‌గా ఉన్న మర్ఫీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సులు బాది హడలెత్తించాడు.
అవి కూడా ఏదో అడ్డిగుడ్డిగా కొట్టిన సిక్సులు కాదు. స్పెషలిస్ట్ బ్యాటర్ ఆడినట్లు పర్ఫెక్ట్ టైమింగ్‌తో కొట్టాడు. షమీ ఆ సిక్సులు కొడుతుంటే.. ఒ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ వచ్చి ఆడుతున్నాడా? అనిపించింది. సిక్సులతో పాటు ఓ కట్ షాట్‌తో కవర్స్‌లోకి షమీ కొట్టిన ఓ బౌండరీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. కాగా.. షమీకి ఇప్పటికే టెస్టుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన అనుభవం ఉంది. అప్పుడప్పుడు నెట్స్‌లో షమీ గంటల కొద్ది బ్యాటింగ్ చేస్తూ కూడా కనిపిస్తుంటాడు. తన స్లాట్‌లో బంతి పడితే.. ఏమాత్రం కనికరం లేకుండా షమీ సిక్సుకు పంపుతాడు. ముఖ్యంగా టెస్టుల్లో షమీ చేస్తున్న పరుగులు ఎంతో కీలకంగా మారుతున్నాయి. లభిస్తున్న లీడ్‌కు మరో 20, 30 పరుగులు అదనంగా జోడిస్తుంటాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ షమీ 47 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో విలువైన 37 రన్స్ చేశాడు. ఇవి కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, పుజారా కంటే కూడా ఎక్కువ.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 177 పరుగులకు ఆలౌట్ అయింది. లబుషేన్ 49 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జడేజా 5, అశ్విన్ 3, షమీ, సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు. తొలి రోజు చివరి సెషన్‌లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా రెండో రోజు పూర్తిగా ఆడి.. మూడో రోజు తొలి సెషన్‌లో ఆలౌట్ అయింది. సరిగ్గా 400 పరుగులు ఇన్నింగ్స్ ముగించింది. కెప్టెన్ రోహిత్ 120, అక్షర్ పటేల్ 84, జడేజా 70 పరుగులతో రాణించారు. ఆసీస్ డెబ్యూ బౌలర్ టాడ్ మర్ఫీ 7 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే కెప్టెన్ కమిన్స్ 2, నాథన్ లయన్ ఒక వికెట్ తీసుకున్నారు. టీమిండియాకు 223 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ టీమిండియా చేతుల్లో ఉన్నట్లే. ఆసీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 223 పరుగులలోపు ఆలౌట్ చేస్తే.. భారత్ ఈ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుంది. మరి ఇండియా తొలి ఇన్నింగ్స్‌తో షమీ ఆడిన ఇన్నింగ్స్‌తో పాటు భారత్ విజయావకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🔥 SHAMI SPECIAL! That was entertaining while it lasted.
👏 A splendid knock from @MdShami11!
📷 BCCI • #MohammedShami #INDvAUS #AUSvIND #BorderGavaskarTrophy #TeamIndia #BharatArmy pic.twitter.com/u0vuLfYIXu
— The Bharat Army (@thebharatarmy) February 11, 2023
Effective and entertaining from Shami bhai 🤩💪
A fiery 3️⃣7️⃣ off 4️⃣7️⃣ is what you need on a Saturday morning 🔥#INDvAUS | #TeamIndia | #BGT2023 | @MdShami11 pic.twitter.com/leNEf3GwQ3
— Gujarat Titans (@gujarat_titans) February 11, 2023