స్పెషల్ డెస్క్- సినీ, రాజకీయ ప్రముఖులకు అభిమానులుండటం సహజం. సినీ హీరో, హీరోయిన్లకు ఐతే వీరాభిమానులుంటారు. ఒక దశలో కొంత మంది హీరో, హీరోయిన్లకైతే ఏకంగా గుడి కూడా కట్టిన సందర్బాలను మనం చూశాం. ఇక రాజకీయ నాయకులకు సైతం అభిమానులండటం సహజమే. కానీ ఒక రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్ కు మరో రాష్ట్రంలో అభిమానులుండటమే అరుదు.
కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేకు తెలంగాణలో అభిమానులుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది కూడా చేతిపై ఆ ఎమ్మెల్యే ఫోటో ను పచ్చ బొట్టు వేసుకునేంత అభిమానం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అవును గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినికి ఏపీలో మాత్రమే కాదు తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు.
కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లికి చెందిన దూడం అనిల్ ఏపీలోని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినికి వీరాభిమాని. ఆమె చేస్తున్న ప్రజా సేవ, సామాజిక కార్యక్రమాలను చూసి అనిల్ ఆమెకు వీరాభిమానిగా మారిపోయాడు. విడదల రజిని ఏ కార్యక్రమం చేసినా వాటి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు అనిల్.
ఇదిగో ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే విడదల రజిని ఫోటోను తన చేతిపై పచ్చబొట్టు రూపంలో టాటూ వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎమ్మెల్యే రజినిని చిలకలూరిపేటలోని ఆమె కార్యాలయంలో కలిసి పచ్చబొట్టు చూపించారు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు చూని అభిమానిగా మారినట్లు యువకుడు చెప్పాడు. ఐతే అతని పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే విడదల రజిని యువకుడు అనిల్ కు ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటానని చెప్పారు.
@VidadalaRajini యావత్ తెలంగాణ ప్రజా నాయకునికి తెలియజేయడానికి రజని అక్క అంటే ఊర్లో కాదు గల్లీలో కాదు ఢిల్లీలో కాదుbరజిని అక్క నాయకత్వం వర్ధిల్లాలి గుండెల్లో వర్ధిల్లాలి అనిల్ కుమార్ దుడం pic.twitter.com/OTK2wXH23y
— Anil Dudam (@AnilDudam2) September 18, 2021
విడుదల రజిని అక్కపై అభిమానంతో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన నేను ఆమె చిత్రాన్ని పచ్చబొట్టు వెపించుకోవడం జరిగింది @VidadalaRajini @YSJaganTrends @Team_YSJR @JaganArmy_ @ysjagan @ManviDad@AKYOnline @ pic.twitter.com/fNYxhudaJr
— Anil Dudam (@AnilDudam2) September 14, 2021