ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. నిస్వార్థంగా, నిత్యం ప్రజల కోసమే పనిచేసే వ్యక్తిగా ఆమెకు పేరు. పార్టీలకు అతీతంగా ఆమె ప్రజలపై చూపే ప్రేమకు ఇతర నాయకులు సైతం ఆశ్చర్యపోతుంటారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఆమె చేసిన సేవలు మరువలేనివి. ఎక్కడో మారు మూల ప్రాంతాలో ఉన్న గిరిజన ప్రజలకు ఎన్నో కిలో మీటర్లు నడిచి మరి వారికి నిత్యావసర సరకులు అందించింది. అలాంటి వ్యక్తి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తనకు ఇన్నాళ్లు సెక్యూరిటీగా ఉన్న గన్‌మెన్ల పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఇది కూడా చదవండి : అర్థరాత్రి అడవిలో జవాన్లుకు ఎమ్మెల్యే సీతక్క సాయం.. వీడియో వైరల్
ఆమెకు భద్రత కల్పిస్తోన్న గన్ మెన్లు బదిలీ అయ్యారు. తన గన్‌మెన్లు బదిలీ అవ్వడంతో ఎమ్మెల్యే సీతక్క కంటతడి పెట్టుకున్నారు. వారు బదిలీ కావడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సీతక్క. వారు తనను కంటికి రెప్పలా చూసుకున్నారని భావోద్వేగానికి గురయ్యారు.ఇంతకాలం వారితో కుటుంబ బంధం ఏర్పడిందని, తన పట్ల వారు గౌరవాన్ని పెంచే విధంగా వ్యవహరించారని సీతక్క అన్నారు. వారు ఎక్కడ ఉన్న ఆనందగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క బదిలి అయిన గన్‌మెన్లకు సన్మానం చేశారు. గన్ మెన్లు బదిలీపై ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగం కావడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : తెలంగాణ ఎమ్మెల్యే సీతక్కకు ధ్యాంక్స్ చెప్పిన హీరో సూర్య