ఒకగానొక్క కొడుకు.. వాడిపైనే అన్నీ ఆశలు. వారి ఆశలు నిజం చేస్తూ ఆ కొడుకు కానిస్టేబుల్ జాబ్ సాధించాడు. ఆ తల్లిదండ్రులు తమ దగ్గర బంధువుల అమ్మాయితో ఇటీవలే కొడుకు వివాహం జరిపించారు. విధి ఆడిన వింత నాటకంలో వారి సంతోషం మూణ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. రోడ్డు ప్రమాదం అతని జీవచ్ఛవంలా మార్చేసింది. అతడు బ్రెయిన్ డెడ్ కావడంతో పుట్టెడు దుఃఖంలోను అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచింది ఆ కుటుంబం.
హైదరాబాద్ లోని గోల్నాకలో తులసీరాంనగర్ కు చెందిన శ్రీకాంత్(27) ప్లేట బురుజులో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆర్నేళ్ల క్రితమే తన సమీప బంధువైన నళిని(25)ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆర్నేళ్లకే ఆ ఇంట విషాదం చోటుచేసుకుంది. జనవరి16న శ్రీకాంత్ విధులు ముగించుకుని తన ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తుండగా, గోల్నాక మొయిన్ రోడ్డు సమీపంలోకి రాగానే ఓ మైనర్ బాలుడు బైక్ పై వేగంగా వచ్చి శ్రీకాంత్ బైక్ ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ కు తీవ్రగాయాలు కావడంతో మలక్ పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులు పాటు చికిత్స అందించిన అనంతరం శ్రీకాంత్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యలు సూచనల మేరకు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు.
పుట్టెడు దుఃఖంలోను ఆ కుటుంబ సభ్యులు ఇతరుల కుటుంబాల్లో వెలుగు నింపినారు . ఈ ప్రమాదానికి కారణమైన ఆ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జీ ఆదేశాల మేరకు ఆ బాలుడిని పోలీసులు జువైనల్ హోమ్ కి తరలించారు. ఆ మైనర్ బాలుడికి బైక్ ఇచ్చి అతడి తల్లిదండ్రులు తప్పు చేశారు. వేగంగా నడిపి ఈ బాలుడు తప్పు చేశాడు. కానీ ఏ తప్పు చేయని ఈ కానిస్టేబుల్ మాత్రం బలైయ్యాడు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.