సిద్దిపేట- తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ పరమైన కార్యక్రమాల్లోనే కాదు, సామాజిక సేవ పట్ల కూడూ చాలా యాక్టీవ్ గా ఉంటారు. తనకు వ్యక్తిగతంగా సామాజిక మాధ్యామాల్లో సమస్యలను వివరించేవారికి సైతం ఆయన సాయం చేస్తుంటారు. ప్రభుత్వ పరంగానే కాకుండా కొంత మందికి తాను వ్యక్తిగతంగాను హెల్ప్ చేస్తూవస్తున్నారు కేటీఆర్. ఇదిగో ఇక్కడ కేటీఆర్ తన మంచి మనస్సును మరోసారి చాటుకున్నారు.
తన కళ్లముందే రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే స్పందించిన కేటీఆర్, వారికి తన వంతు సాయం చేశారు మంత్రి కేటీఆర్. సిద్దిపేట ఔటర్ బైపాస్ వద్ద మెడికల్ కాలేజీ దగ్గరలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ కి ఢీకొట్టిన సిద్దిపేట కాళ్ళకుంట కాలనీకి చెందిన ఇద్దరు ముస్లిం యువకులు కింద పడ్డారు. అదే సమయంలో అటువైపు నుంచి మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళ్తోంది.
రోడ్డు ప్రమాదాన్ని చూసి వెంటనే ఆగిన మంత్రి కేటీఆర్ కారు దిగి, తన కాన్వాయ్ లోని 2 కార్లల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ముస్లిం యువకులను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన పీఏ మహేందర్ రెడ్డిని, ఎస్కార్ట్ పోలీస్ లను కూడా వారి వెంట పంపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఫోన్ లో మంత్రి కేటీఆర్ సూచించారు. ఆపదలో స్పందించిన మంత్రి కేటీఆర్ కు గాయపడ్డ యువకుల బంధువులు, ఇతర వాహనదారులు కృతజ్ఞతలు చెప్పారు.