సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 11 మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికి ఆయన లేరనే వార్తను జీర్ణించుకోలేకున్నారు. ఇటీవల హైదరాబాద్ లో దశదిన కర్మ అనంతరం.. కృష్ణంరాజుక స్వగ్రామం మొగల్తూరులో గురువారం కుటుంబ సభ్యులు సంస్మరణ సభను నిర్వహించారు. ఈకార్యక్రమానికి పలువురు ఏపీ మంత్రులు హాజరయ్యారు. కృష్ణం రాజు కుటుంబ సభ్యులను మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పరామర్శించారు.
కృష్ణం రాజు సంస్మరణ సభకు హజరైన మంత్రి రోజా.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రోజా ప్రభాస్ తో కొద్ది సేపు ముచ్చాటించారు. అనంతరం కృష్ణం రాజు భార్య శ్యామల దేవి రోజా పరామర్శించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రోజా తో పాటు చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు హజరయ్యారు. రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత కృష్ణం రాజు కే దక్కుతుందని రోజా నివాళి అర్పించారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని.. ఆయన లేక పోవడం సినీ ఇండస్ట్రీకి తీరని లోటన్నారు. కృష్ణం రాజు సినిమాల్లో రెబల్ స్టార్, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ గా అభివర్ణించారు. భౌతికంగా ఆయన దూరమైన ఆయన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరని రోజా కొని యాడారు. ప్రస్తుతం కృష్ణం రాజు కుటుంబ సభ్యులతో రోజా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.