ఫిల్మ్ డెస్క్- మిల్కీ బ్యూటీ.. సినీ అభిమానులకు తమన్నా ఇలాగే పరిచయం. ఫ్యాన్స్ ముద్దుగా తమన్నాను మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన తమన్నా పరిశ్రమకు వచ్చి 16 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్‌గానే చలామణి అవుతోంది. విభిన్న కధలను ఎంచుకుంటూ, వినూత్న పాత్రలతో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది తమన్నా. ఇటీవల మాస్ట్రో సినిమాలో విలన్ రోల్ లో నటించి అందరిని మెప్పించింది.
ఐతే తాను కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఓ ఇంటర్వూలో చెప్పింది తమన్నా. తనకు మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయని, కానీ ఎక్కువగా వర్కవుట్స్ చేయడం, ఒత్తిడి కారణంగా ఓ అనారోగ్య సమస్యను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది తమన్నా. దాని నుంచి బయటపడేందుకు వైద్య నిపుణుల సూచనలతో వ్యాయామాలు చేస్తున్నానని చెప్పింది. ఫ్రై చేసిన ఆహారం పూర్తిగా మానేశానని అంది.
ప్రస్తుతం ఆర్గానిక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నానని తెలిపింది. మరోవైపు క్రమం తప్పకుండా నోని లేదా తొగరి ఫలంను తీసుకుంటున్నాని చెప్పింది. ఈ జ్యూస్ తనకున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడేందుకు చాలా ఉపయోగపడుతుందని తమన్నా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రతిరోజు ఉసిరి రసం, బాదం పాలు, పసుపు, కొబ్బరి నీళ్లు తన డైట్‌లో ఉండేలా చూసుకుంటానని చెప్పింది తమన్నా.
ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండేందుకు లిక్విడ్ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు వివరించింది. అయితే తనకున్న ఆరోగ్య సమస్య ఏంటన్న దాన్ని మాత్రం తమన్నా చెప్పలేదు. దీంతో అసలు తమన్నాకు ఏమైందబ్బా అని ఇండస్ట్రీలోని వారితో పాటు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తమన్నా త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందామా..