మైకోసాఫ్ట సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం మరణించారు. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ స్టాఫ్‌కు ఇమెయిల్ ద్వారా తెలిపింది. జైన్ నాదెళ్ల వయసు 26 సంవత్సరాలు. అతను సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. సెరిబ్రల్ పాల్సీ అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో బ్రెయిన్‌కు కాళ్లు, చేతులపై కంట్రోల్ ఉండదు. అంటే నడవలేరు. వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే సత్య నాదేళ్లకు కొడుకు తో పాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.
2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. భారత దేశం నుంచి ఈ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. మైక్రోసాఫ్ట్ మెరుగైన సేవలు అందించేందుకు తనవంతుగా సత్య నాదెళ్ల పని చేశారు. ఇదిలా ఉంటే పలు సందర్భాల్లో తన కొడుకు జైన్ ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించారు. జైన్ తన ఎక్కువ భాగం చిల్డ్రన్స్ హాస్పిటల్ లోనే చికిత్స తీసుకున్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ ను నెంబర్ వన్ బ్రాండ్ గా తీర్చిదిద్దడంలో సత్య నాదెళ్ల కీలకంగా నిలిచారు. దీంతో ఈ ఏడాది జనవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రపంచంలోని టాప్ సీఈఓల్లో టాప్ లో నిలిచారు. అమెరికాకు వలస వచ్చిన సత్య నాదెళ్ల కుటుంబం మొదటి తరం భారత్ కు చెందినవారు. ఆయన తనయుడు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.