ఇషాన్ కిషన్.. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచం మొత్తం రీసౌండింగ్ వస్తోంది. బంగ్లాదేశ్ పై జరిగిన వన్డే మ్యాచ్ లో ఇషాన్ కిషన్ డబుల్ సెచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతని ఆటపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఎప్పుడూ టీమిండియాపై నోరు పారేసుకుంటూనే ఉండే వాన్.. ఈసారి కూడా తన వక్ర బుద్ధిని ప్రదర్శించాడు. ఓవైపు ఇషాన్ ని పొగుడుతూనే మరోవైపు టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ఇషాన్ ని చూసి నేర్చుకోండి అంటూ ఘాటుగా స్పందించాడు.
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీపై మైఖేల్ వాన్ ఇలా స్పందించాడు. “ఈరోజుల్లో వన్డే క్రికెట్ ఈ విధంగా ఆడాలి చూసి నేర్చుకోండి టీమిండియా” అంటూ ట్వీట్ చేశాడు. అయితే మైఖేల్ వాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిన తర్వాత కూడా వాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియా జట్టు అత్యంత పేలవమైనది అంటూ కామెంట్ చేశాడు. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదంటూ వ్యాఖ్యానించాడు. వైట్ బాల్ క్రికెట్ లో అత్యంత దారుణంగా ఆడిన జట్టు ఏదైనా ఉంది అంటే అది టీమిండియానే అంటూ నోరు పారేసుకున్నాడు. ఇలాంటివి వినడం సహజమే.
ఇషాన్ కిషన్ తన డబుల్ సెంచరీతో మొత్తం 10 రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 126 బంతుల్లో ద్విశతకం నమోదు చేశాడు. ఆ మ్యాచ్ లో ఇషాన్ 210 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో ఆటగాడు ఇషాన్ కిషన్. కీపర్ గా అత్యధిక పరుగులు ఇషాన్ వే. గతంలో 183 పరుగులతో ఆ రికార్డు ధోనీ తరఫున ఉండేది. ఇప్పుడు ఇషాన్ 210 పరుగులతో ముందున్నాడు. ఇంక ఇలాంటి రికార్డులు 8 ఉన్నాయి. మొత్తానికి ఒక ఇన్నింగ్స్ తో క్రికెట్ ప్రపంచం మొత్తం అతని గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఇంక క్రికెట్ మాజీలు అంతా ఇషాన్ కిషన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా పని అయిపోయింది అని విమర్శించే వారందరికీ ఇషాన్ తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. బంగ్లాదేశ్ తో టీమిండియా డిసెంబర్ 14న తొలి టెస్టు, డిసెంబర్ 22న రెండో టెస్టులో పోటీ పడనుంది.
Fastest ODI Double Centurion…
Youngest ODI Double CenturionCongratulations Ishan Kishan!@ishankishan51 @BCCI #ishankishan pic.twitter.com/IeCl8lQrdd
— Ram Satpute (@RamVSatpute) December 10, 2022