మన సమాజంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. కొందరు ఆడపిల్ల వద్దనుకుని.. కడుపులోనే చిదిమేస్తుంటే.. మరికొందరు మాత్రం.. మహాలక్ష్మి జన్మించిందని భావిస్తారు. కుమార్తెని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఇక ఆడపిల్లల జీవితంలో తండ్రి పాత్ర ఎంతో ప్రత్యేకం. ప్రతి కుమార్తె మొదటి ప్రేమ ఆమె తండ్రి, కూతురు జీవితంలో నాన్న ఓ నమ్మకం, ఓ రియల్ హీరో. కూతురు అంటే నాన్నకు మరో అమ్మ.. తండ్రికి కుమార్తె అంటే యువరాణి. ఇలా తండ్రి-కుమార్తెల మధ్య ఉండే ప్రేమ, అనురాగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసి.. చూపరుల చేత కంట తడిపెట్టించారు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమార్తె సాయి అనన్య.
మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి అనంతరం ఆయన కుటుంబ సభ్యులు హిందూ ధర్మ సంప్రదాయ ప్రకారం.. పెద్ద కర్మను నిర్వహించారు. మార్చి 3న ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీఐపీలు తరలి వెళ్లారు. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ముఖ్యంగా భార్య, కూతురు గౌతమ్ రెడ్డి కుమార్తె ఇంకా తేరుకోలేదు. గౌతమ్ రెడ్డి ఫోటో దగ్గర వారు తీవ్ర విషాదవదనంలో కనిపించారు.
ఇది కూడా చదవండి : గౌతమ్ రెడ్డి కోసం మేకపాటి కుటుంబం సంచలన నిర్ణయం!ఇక గౌతమ్ రెడ్డి కూతురు సాయి అనన్య.. తండ్రిపై ప్రేమను గుర్తు చేసుకుంటూ.. తాను ధరించే డ్రెస్ పై తండ్రి పేరుని డిజైన్ చేయించుకుంది. తండ్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును చున్నీ అంచుకు బోర్డర్ లా ఎంబ్రాయిడరీ చేయించుకుంది. తన తండ్రి భౌతికంగా ఈరోజు తమను వదిలి వెళ్లిపోయారు.. కానీ తన జ్ఞాపకాల్లో ఎల్లప్పుడూ తండ్రి తనతో ఉంటాడని.. తండ్రిపై తనకు ఉన్న ప్రేమను అనన్య చెప్పకనే చెప్పింది. ఇది చూసిన వారు.. తండ్రిపై అనన్య ప్రేమను చూసి ఆవదేన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : మేకపాటి కుటుంబానికి సీఎం జగన్ అభయం! రంగంలోకి వారసుడు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.