రానున్నది అసలే పండుగలు, వేడుకల సీజన్. క్రిస్మస్, ఆ వెంటనే న్యూ ఇయర్ వేడుకలు. ఇక మందుబాబుల వారం రోజుల పాటు పండగ చేసుకుంటారు. మద్యం దుకాణాలకు ఫుల్లు గిరాకీ. ఈ వారం రోజులను తెగ క్యాష్ చేసుకుంటాయి మద్యం దుకాణాలు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. వేడుకలు, పండుగలపై ఆంక్షలు విధించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు సూచించింది. చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం మందు బాబులకు భారీ షాకిచ్చింది.
క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 24, 25 తేదీల్లో.. అలానే కొత్త సంవత్సరం జనవరి 1న మద్యం దుకాణాలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం రాష్ట్రం మొత్తం కాకుండా కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.