ఫిల్మ్ డెస్క్- ఆర్ఆర్ఆర్.. దర్శక ధీరుడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా నేపధ్యంలో ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ, ఎట్టకేలకు వచ్చే నెల జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రలో నటించగా, అజయ్ దేవగన్, ఆలియా భట్ తదితర భారీ తారగణం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తోంది.
ఇక ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ కలిగించేలా సాగిన డైలాగ్‌లతో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మొదలు సెలబ్రెటీలు వరకు రెస్పాండ్ అవుతున్నారు.
రాజమౌళి డైరెక్షన్ కు, ఎన్టీఆర్, రాంచరణ్ నటనకు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అంతా ఫ్లాట్ అవుతున్నారు. అదిరిపోయింది రాజమౌళి సార్ అంటూ సెలబ్రెటీలంతా ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిగో ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్‌పై స్పందించారు. రామ్ చరణ్ షేర్ చేసిన ట్రైలర్ పోస్ట్‌పై చిరంజీవి వెంటనే రీట్విట్ చేస్తూ.. ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించింది.. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటాను.. అంటూ కామెంట్ చేశారు.
అన్నట్లు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెలుగు, హిందీ తో పాటు పలు బాషల్లో 2022 జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలోనే మూవీ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంది. బాహుబలి తరువాత రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరి చూపు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది.
RRR Trailer బీభత్సం …ఇక ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురుచూస్తుంటాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 9, 2021