గుంటూరు క్రైం- ఆంద్రప్రదేశ్ లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న తాడెపల్లిలో గ్యాంగ్ రేప్ రేప్ ఘటన మరవక ముందే గుంటూరులో రమ్య హత్య జరిగింది. తాజాగా మరో మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. దీంతో హత్యలు, ఆత్యాచార ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. గుంటూరులో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ తో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
జిల్లాలోని రాజుపాలెం మండలంలో ఓ మైనర్ బాలికను లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల పరిధిలో పులిచింతల ప్రాజెక్టు పునరావాస కేంద్రంలో ఈ అమానుషం చోటుచేసేకుంది. బుధవారం మధ్యాహ్నం మైనర్ బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా, మాటు వేసిన పక్కింటి యువకుడు ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లాడు. అప్పటికే ఇంట్లో ఉన్న మరో స్నేహితుడితో కలసి బాలికపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.
జరిగిన విషయం తెలియడంతో కుటుంబ సభ్యులకు బాలికను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. తన మేనకోడలిపై ఇద్దరు అత్యాచారం చేశారని బాధితురాలి మేనమామ రాజుపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే గ్రామానికి చెందిన గల్లాలా భాను, మేరుగు సంజీవ్ లే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
గుంటూరు జిల్లాలో ఇలా వరుస అత్యాచార, హత్య ఘటనలు జరుగుతండటంతో జనం భయబ్రాంతులకు గురవుతున్నారు. అమ్మాయిలను బయటకు పంపాలంటేనే కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అఘాయిత్యం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.