చెన్నై(నేషనల్ డెస్క్)- కరోనా విజృంబిస్తున్న నేపధ్యంలో మనకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా బయటకు ఎక్కడికి వెళ్లినా మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. బయటే కాదు, ఇంట్లో ఉన్నా మాస్కు ధరిస్తే ఇంకా మంచిదని అంటున్నారు. ఐతే చాలా మంది బయటకు వెళ్లే సమయంలో మాస్కులు మచిరిపోతున్నారు. హడావుడిగా ఇంట్లోంచి వెళ్లాక.. తీరా చూసుకుంటే మాస్క్ ఉండదు. దీంతో చాలా మంది చేతి రుమాలును మొహానికి మాస్క్ లాగా కట్టుకుంటున్నారు. దీని కోసం తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ఇంజినీరింగ్ సంస్థ వినూత్నంగా ఆలోచించి.. ఏకంగా మాస్క్ వెండింగ్ మెషిన్ తయారు చేసింది.
చెన్నైలోని కోయంబేడు బస్టాండులో ఈ మాస్క్ వెండింగ్ మెషిన్ ను ఏర్పాటు చేశారు. మాస్కు కావాల్సిన వారు ఐదు రూపాయల కాయిన్ మెషిన్ లో వేస్తే వెంటనే మాస్క్ బయటకు వచ్చేస్తుంది. బ్యాంకు ఏటీఎం లాగే పనిచేస్తుంది ఈ మాస్క్ మెషిన్. దీంతో మాస్క్ కావాల్సిన వారు ఈ మాస్క్ వెండింగ్ మెషిన్ ద్వార మాస్కులు తీసుకుంటున్నారు. ఇది ఎంతో సౌలభ్యంగా ఉందని, మాస్క్ కోసం మెడికల్ షాపుల కు వెళ్లక్కర్లేదని జనం అంటున్నారు. ఇలాంటివి అన్ని చోట్లా ఏర్పాటు చేస్తే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు. భలే ఉంది కదా ఈ మాస్క్ వెండింగ్ మెషిన్.