కడప క్రైం- ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోటు వివాహేతర సంబంధానికి సంబందించిన పరిణామాలను చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని సందర్బాల్లో హత్యలు సైతం జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా.. వివాహేతర సంబంధాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఓ వివాహేతర సంబంధం విషాదానికి దారి తీసింది. కట్టుకున్న భర్త, బంగారం లాంటి పిల్లలు ఉండగా, పరాయి మగాడితో అక్రమ సంబంధం సాగించింది ఓ వివాహిత. భర్త ఇంట్లో లేని సమయాల్లో అతడితో సరస సల్లాపాలు నడిపింది. ప్రియుడి మాయలో పడిపోయిన సదరు మహిళ భర్తను, పిల్లలను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అనంతపురం నూతన కాలువలు చెందిన 23 ఏళ్ల పడిగిపాలెం రిజ్వానా కు కడప జిల్లా సింహాద్రిపురానికి చెందిన సర్దార్ తో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు రేపింది. రిజ్వానా, స్థానికంగా ఉండే హర్షవర్ధన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వస్తోంది. విషయం భర్తతో పాటు, ఇంట్లో వాళ్లకు తెలియడంతో పెద్దలు మందలించారు. ఐనా రిజ్వానా మాత్రం మారలేదు. కొన్నాళ్ల క్రితం ప్రియుడు హర్షవర్ధన్ తో కలసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది రిజ్వానా.
ఆమె కోసం తీవ్రంగా గాలించిన భర్త, కుటుంబ సభ్యులు చివరకు 10 రోజుల క్రితం బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. పంచాయితీ పెట్టి భర్తతో కాపురం చేసుకోవాలని పెద్దలు రిజ్వానాకు నచ్చజెప్పారు. భర్త కూడా ఆమె తప్పును మర్చిపోయి కాపురం చేద్దామని చెప్పడంతో అంతా సర్దుమణిగింది. అప్పటి నుంచి ఆమె తన భర్తతో కలిసి పులివెందులలో ఉంటున్నారు.
ఈ క్రమంలో రిజ్వానా హర్షవర్ధన్‌ను దూరం పెట్టేసింది. అతడితో మాట్లాడటం మానేసింది. దీంతో రిజ్వానాపై ఆగ్రహంతో రగిలిన పోయిన హర్షవర్ధన్.. రిజ్వానా, ఆమె భర్త మార్కెట్ కు వెళ్లిన సమయంలో వారిద్దరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో రిజ్వానా అక్కడిక్కడే మృతి చెందగా, ఆమె కుమార్తె మొగిషీన్ కు స్వల్ప గాయాలయ్యాయి. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు హర్షనర్ధన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.