ఫిల్మ్ డెస్క్- ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు చాలా మంది. ఇంకొంత మంది ఐతే ఒక్కరు చాలని అనుకుంటున్నారు. పాత కాలంలోలా నలుగురైదుగురు పిల్లల్ని కనడం చాలా అరుదు. కానీ మంచువారబ్బాయి, హీరో విష్ణు మాత్రం తనకు ఇంకా పిల్లలు కావాలని అంటున్నాడు. ఇప్పటికే నలుగురు పిల్లలుండగా, మళ్లీ పిల్లలు కావాలని కోరడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
మంచు విష్ణుకు ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒసారి కవల పిల్లలు కూడా. ఈ అంశంపై నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు. క్రికెట్ టీం కానీ ప్లాన్ చేస్తున్నావా విష్ణు అంటూ సెటైర్లు వేసారు కొంత మంది. ఇదిగో ఇటువంటి సమయంలో మరోసారి మంచు విష్ణు పిల్లల టాపిక్ తెరపైకి వచ్చింది. ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీతో సరదాగా షోకు వచ్చారు మంచు విష్ణు.
ఈ షోలో మంచు విష్ణును ఆలీ చాలా విషయాలను అడిగారు. ఈ క్రమంలో పిల్లల గురించి ప్రస్తావన వచ్చింది. అంతా ఒక్కరు ఇద్దరూ పిల్లలు చాలని అనుకుంటుంటే, నువ్వేమో నలురురిని దించేసావ్.. ఇంకా ప్లాన్ చేస్తున్నావా అని సరదాగా అడిగారు ఆలి. ఈ ప్రశ్నకు మంచు విష్ణు సైతం చాలా కూల్ గా సమాధానమిచ్చారు. మా సిస్టర్‌ను ఎందుకు అంత అబ్యూస్ చేస్తున్నావ్, నలుగురు పిల్లలు చాలు, అని చాలా మంది తిట్టారని చెప్పాడు.
అయితే తనకు ఇంకా పిల్లలు కావాలని తన భార్యతో చెప్పానని గుర్తు చేశారు విష్ణు. దానికి తన భార్య కూడా సరదా సమాధానమే ఇచ్చిందని, ఇంకెవర్నైనా చూసుకో పో అంటూ కసురుకుందని చెప్పుకొచ్చారు. ఆ ఐడియా కూడా బాగానే ఉందని కామెడీ చేశారు మంచు విష్ణు. ఇంకేముంది మళ్లీ ఇప్పుడు మంచు విష్ణు పిల్లల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇక మంచు విష్ణుతో ఆలీతో సరదాగా ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.