మంచు లక్ష్మి.. టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఇక అప్పుడప్పుడు ఈ నటి సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు తెగ వైరవుతుంటాయి. ఈ క్రమంలో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు మంచు లక్ష్మి. న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవడం కోసం విదేశాలకు వెళ్తున్నారు మంచు లక్ష్మి. ఈ క్రమంలో ఆమె చేసిన ట్వీట్ నెటిజనలను తెగ ఆకర్షిస్తోంది.
ఇది కూడా చదవండి : తీవ్రంగా గాయపడ్డ మంచు లక్ష్మి..! ఏమైందంటే?
ఈ ట్వీట్‌లో మంచు లక్ష్మి.. ‘నాకు ఆకలి వేయకపోయిన.. తిన్నాను. ఎందుకంటే..ఈ ఫ్లైట్ టికెట్ కొనడానికి నేను నా కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది… ఆ డబ్బులకు న్యాయం చేయడం కోసం ఆకలి లేకపోయినా తిన్నాను..’ అంటూ మంచు లక్ష్మి చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
I’m not even hungry but I’m still eating in the lounge because I want to make the most for my buck since I had to sell a kidney to buy this flight ticket🙄 😝
— Lakshmi Manchu (@LakshmiManchu) December 26, 2021
ఇది చూసిన నెటిజనులు ‘మీరు చాలా రిచ్ కదా.. మీరు కూడా ఇలానే చేస్తారా’.. ‘మంచక్కా మీరు కూడా మా కులమే అక్కా అంటూ’ రీట్వట్ చేస్తున్నారు. దీనిపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘మా నాన్న రిచ్ తమ్ముడు.. నేను కాదు’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ లు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.
Meeru kuda ma kulame akka😂
— Bharath Sai (@Bharathbobs) December 26, 2021