ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా అవసరం. దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ డోసులు రెండు మాత్రమే తీసుకోవాలి. కానీ ఇటీవల న్యూజిలాండ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ఒకే రోజులో 10 డోసులు తీసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇది నిజమా కాదా అనే సందేహంతో.. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ధర్యాప్తు ప్రారంభించింది.
సదరు వ్యక్తి ఎందుకు పదిసార్లు వాక్సిన్ వేయించుకున్నాడో ఇంకా తెలియలేదు. కానీ ఆ వ్యక్తి ఒకేరోజు వేర్వేరు ఐడీలతో వేర్వేరు వాక్సిన్ కేంద్రాలలో వాక్సిన్ వేయించుకున్నాడని.. అందుకు సంబంధించి అమౌంట్ కూడా చెల్లించినట్లు తెలుస్తుంది. కానీ మినిమం రెండు వాక్సిన్ లకు మించి తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూజిలాండ్ COVID వ్యాక్సిన్ – ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గ్రూప్ మేనేజర్.. ఆస్ట్రిడ్ కార్నిఫ్ మాట్లాడుతూ.. “హెల్త్ మినిస్ట్రీకి సమాచారం అందించాం. మేము 10 వాక్సిన్స్ తీసుకున్న విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇది చాలా డేంజర్ సిట్యుయేషన్.. వేరే ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాము. 10 డోసులు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో.. అతను వెంటనే దగ్గరలోని డాక్టర్లను సంప్రదిస్తే మంచిదని సూచించారు. ప్రస్తుతానికి ఈ 10 దోషులకు సంబంధించిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం అందలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ మా తరపున తీవ్రమైన దర్యాప్తు జరుపుతున్నామని న్యూజిలాండ్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.
ఆక్లాండ్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నిక్కీ టర్నర్ మాట్లాడుతూ.. ‘కోవిడ్ వ్యాక్సిన్‌ఎక్కువ డోసులు తీసుకుంటే.. శరీరంలోని అవయవాల పనితీరు పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఈ షాకింగ్ సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.