దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలుపల షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఏం కష్టం వచ్చిందో.. ఏం అన్యాయం జరిగిందో తెలియదు కానీ.. ఓ వ్యక్తి కోర్టు వెలుపల ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటికి నిప్పంటించుకుని తనను తాను సజీవ దహనం చేసుకోవాలని భావించాడు.
బాధితుడిని నోయిడాకు చెందిన రాజ్ భర్ గుప్తాగా గుర్తించారు. గుప్తా శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు వెలుపల ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి.. మంటలను ఆర్పి.. అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.