మనలోని యాక్టింగ్ స్కిల్.. పెరిగి పెద్దదై ఆఫీసుల్లోనూ, కట్టుకున్న వారి దగ్గర నట విశ్వరూపం చూపిస్తుంటాం. అయితే డ్రామా కింగ్, క్వీన్స్‌లు ఇటీవల ఎక్కువైపోతున్నారు. ప్రతి విషయంలోనూ డ్రామా ప్లే చేస్తున్నారు. తాాజాగా ప్రేమికుడి.. తన ప్రియురాలి పెళ్లి ఆపడం కోసం ఏం చేశాడంటే..?
పొట్టకూటి కోసం నటులేమో.. నటన చేస్తున్నారు కానీ.. అసలైన నటులు మనలోనే ఉన్నారు అన్న సంగతి మర్చిపోతున్నారు. దానికి బీజం పడేది చిన్నప్పుడే. స్కూల్‌కి వెళ్లకూడదనుకుంటే.. కడుపులో నొప్పి అంటూ యాక్టింగ్ చేసేస్తాం. అలా మనలోని యాక్టింగ్ స్కిల్.. పెరిగి పెద్దదై ఆఫీసుల్లోనూ, కట్టుకున్న వారి దగ్గర నట విశ్వరూపం చూపిస్తుంటాం. అయితే డ్రామా కింగ్, క్వీన్స్‌లు ఇటీవల ఎక్కువైపోతున్నారు. ప్రతి విషయంలోనూ డ్రామా ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం బతుకే ఓ నటనగా మారిపోయింది. ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో…అతడిని కేసులో ఇరికించేందుకు అత్యాచార డ్రామా ఆడిన యువతి వార్త గుర్తుందా.. అలాంటిందే ఇప్పుడు ఓ యువకుడు ట్రై చేశాడు. చివరకు ఏమైందంటే.?
ప్రియురాలి పెళ్లి ఆపేందుకు ఓ యువకుడు పెద్ద డ్రామాకు తెర లేపాడు. ఏకంగా తనను కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు కలరింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ వీడియోను తన కుటుంబీకులకు పంపి టెన్షన్ పెట్టాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంభాల్ జిల్లాలోని షాబాజ్ పూర్ కాలా గ్రామానికి చెందిన వసీం అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ప్రియురాలికి మరొకరితో వివాహం నిశ్చయించారు. ఈ నెల 24న పెళ్లి తేదీని ఖరారు చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే ఆమె పెళ్లిని ఆపేందుకు అతడో పెద్ద నాటకమాడాడు. తమ పెళ్లిని ఒప్పుకోని ప్రియురాలి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయాలని భావించిన వసీం కిడ్నాప్ డ్రామా ఆడాడు.
తన కాళ్లను, చేతులను కట్టేసుకుని, నాలుకను బయటకు తెరిచి, ముఖంపై రక్తపు మరకలతో అచేతన స్థితిలో ప్రమాదంలో ఉన్నట్లు వీడియోను క్రియేట్ చేశాడు.ముందుగా దీనికి సంబంధించిన వీడియోను తన సోదరుడికి పంపాడు. ఆ రాత్రి వసీం ఇంటికి తిరిగిరాకపోవడంతో అతని తమ్ముడు, కుటుంబ సభ్యులు అస్మోలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాలిక కుటుంబీకులే అతడిని హత్య చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను చూపించారు. పోలీసులు వసీం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి సమాచారం దొరకలేదు. చివరకు వసీం తన సోదరి ఇంట్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో కిడ్నాప్, హత్య డ్రామా ఆడినందుకు పోలీసులు వసీంను అరెస్ట్ చేశారు.
— Hardin (@hardintessa143) April 26, 2023